Jump to content

నవ్వు

వికీవ్యాఖ్య నుండి
మనుషులు తమ తెలివితేటలను రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. కాని వారు ఎప్పుడూ ఒకే విధంగా నవ్వుతారు---శామ్యూల్ జాన్సన్

నవ్వు ఒక హాయైన భావన. అధిక సంతోషాన్ని వ్యక్తీకరించే ప్రక్రియ.

నవ్వుపై వ్యాఖ్యలు

[మార్చు]
  • ఎవరైతే చిరునవ్వుల్ని ధరించరో వారు పూర్తిగా దుస్తులు ధరించినట్లు కాదు---మహాత్మా గాంధీ
  • నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం...జంధ్యాల
  • మన పెదవులపై మల్లెపువ్వులాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే…. మనల్ని అందరూ ఇష్టపడతారు.
  • అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చెరిపేస్తుంది…భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచేస్తుంది.
  • మన జీవితంలో వృధా అయిపోయే రోజులు ఏవి అంటే…!మనం కొంచం కూడా నవ్వని రోజులు.

సామెతలు

[మార్చు]
  • నవ్వు నాలుగందాల చేటు
  • సిగ్గులేని వాడికి నవ్వే సింగారం
  • ఏడ్చే మగాడిని నవ్వే మహిళను నమ్మరాదు
  • ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు.
  • భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు, దాన హీనుఁ జూచి ధనము నవ్వు, కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును... వేమన.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=నవ్వు&oldid=17406" నుండి వెలికితీశారు