నాయకత్వం
స్వరూపం
నాయకత్వం అనేది ఒక జనసమూహం వారు ఆపాదించుకొన్న విలువలని పాటిస్తూ, వారి ప్రస్తుత సామర్థ్యాన్ని మరియు అంతిమ సంభావ్యతకి మించిన సరిక్రొత్త విలువలను లక్ష్యాలను నిర్దేశించుకొంటూ, కావలసిన లక్ష్యాలని సాధించటానికి దారులని వెదుక్కొనే ఒక చర్య.
- ఆజ్ఞలని శిరసావహించటం ఎన్నటికీ నేర్చుకోలేనివాడు, ఆజ్ఞాపించేవాడు కాలేడు
- అరిస్టాటిల్, తను రచించిన రాజకీయాలు లో
- గొప్పదనం యొక్క వెల, బాధ్యత
- విన్స్టన్ చర్చిల్, హార్వర్డ్ యూనివర్సిటీలో 6 సెప్టంబర్ 1943 న చేసిన ప్రసంగంలో
- తానే అంతా చేసేయాలనుకొనేవాడు, తనకే పేరు మొత్తం దక్కాలనుకొనేవాడెవడూ గొప్ప నాయకుడు కాలేడు
- ఆండ్ర్యూ కార్నిజే
- నిర్వహణ కార్యకలాపాలను సరి చేయటమైతే, నాయకత్వం సరైన కార్యకలాపాలను చేయటం
- పీటర్ డ్రకర్, 1989లో
- నువ్వు నాయకత్వం వహించు, ఇతరులు నిన్ను అనుసరిస్తారు.
- ట్రూడీ జీన్ ఇవాన్స్
- ఏ మార్పు ఈ ప్రపంచం నుండి ఆశిస్తున్నామో, ఆ మార్పు మనమే కావాలి.
- గొర్రెలను కాస్తాం, ఎడ్లను తోలుతాం, ప్రజలకు నాయకత్వం వహిస్తాం. నాకు నాయకుడిగా ఉండు, నన్ను అనుసరించు లేదంటే నా దారి నుండి పక్కకి తప్పుకో.
- జార్జి ఎస్ పాటన్
- రాజకీయ నాయకులు అసలు నాయకులే కారు. నాయకులంటే మనల్ని మేల్కొల్పేవారు.
- హెన్రీ మిల్లర్
- అప్పటికే పడి ఉన్న దారిలో నేను ప్రయాణించను, అసలు దారే లేని చోట నా కాలితో బాట వేసి వదులుతాను.
- మురియల్ స్ట్రోడె
- నాయకత్వానికి బలమైన వ్యక్తిత్వం, పరిపూర్ణమైన సానుకూల దృక్పథం కావాలి. అధికార కేంద్రంగా ఉండగలగటం, ఆత్మ విశ్వాసంతో ఉండగలగటం, అత్యున్నత స్థాయిలో స్వాభిమానం కలిగి ఉండటం వంటివి ఉపయోగకరమే కాక, అవసరాలు కూడా అని నా అభిప్రాయం.
- డేవిడ్ మెక్ క్లెలాండ్
- నాయకత్వాన్ని నిర్వచించడం కష్టం, మంచి నాయకత్వం మరింత కష్టం. కానీ భూమి అంచుల వరకు ప్రజలు మిమ్మల్ని అనుసరించగలిగితే, మీరు గొప్ప నాయకుడు.