నిర్వహణ
Appearance
- చాలా మందిని నిర్వహించటం, కొద్ది మందిని నిర్వహించటం వంటిదే. అది సంస్థని బట్టి ఉంటుంది.
- క్రీ.పూ 6వ శతాబ్దంలో సున్ ట్జూ, తన రచన The Art of War లో
- ఇప్పటికిప్పుడు ఈ అవసరం రాకపోవచ్చు. కానీ సుదీర్ఘ కాలం తర్వాత ఒక బానిసకి యజమాని ఎంత అవసరమో, ఒక యజమానికి బానిస కూడా అంతే అవసరమౌతాడు.
- 1776 లో ఆడం స్మిత్, తన రచన The Wealth of Nations లో
- నిర్వహించటం అనగా దీర్ఘదృష్టి, పథకం, ఏర్పాటు, సమన్వయం మరియు నియంత్రణ కలిగి ఉండటం.
- 1916 లో హెన్రీ ఫాయొల్
- ఎక్కడైతే మానవ కార్యకలాపాలు ఒక క్రమపద్ధతిలో పరస్పర సహకారంతో చేపట్టబడతాయో, ఖచ్చితంగా అక్కడ నిర్వహణ ఉందని అర్థం.
- 1949 లో ఉర్విక్ మరియు బ్రెచ్ The Making of Scientific Management లో
- సంస్థ లేనిదే నిర్వహణ లేదు. కానీ నిర్వహణ లేనిదే సంస్థ లేదు
- 1973 లో పీటర్ డ్రకర్, MANAGEMENT: Tasks, Responsibilities, Practices లో
- ఆలోచించవలసినదంతా నిర్వాహకవర్గానికే వదిలేస్తే ఆ సంస్థ స్థితిగతులలో ఏ మాత్రం మార్పు ఉండదు.
- 1987 లో అకియో మోరిటా, Made in Japan లో
- సమస్య కార్మికుడు కాదు. సమస్య అత్యున్నత నిర్వాహకవర్గం.
- 1993 లో డబ్ల్యు ఎడ్వార్డ్స్ డెమింగ్
- మొదట బస్సులోకి సరైన ప్రయాణీకులని ఎక్కించుకొని, సరికాని ప్రయాణీకులని దించి వేసి, సరైన ప్రయాణీకులకి సరైన సీట్లు కేటాయించి తర్వాతే ఎక్కడికి ప్రయాణించాలో నిర్ణయించుకోవటమే మంచిది.
- 2001 లో జిం సి కొల్లిన్స్, Good to Great: Why Some Companies Make the Leap...and Others Don't లో
- సక్రమంగా నిర్వర్తిస్తే నిర్వహణ ఉత్తమమైన వృత్తి. ఇతరులు ఇన్ని విధాలుగా నేర్చుకొనే, ఎదిగే, బాధ్యత తీసుకొనే, సాధించినవాటికి గుర్తింపు పొందే, జట్టు యొక్క విజయానికి దోహదపడే అవకాశం మరే ఇతర ఉద్యోగము లోనూ లేవు.
- 2011 లో క్లేయ్టన్ ఎం క్రిస్టెన్సన్, Harvard Business Review లో