Jump to content

ముహమ్మద్ ఆలీ

వికీవ్యాఖ్య నుండి
1967 లో ముహమ్మద్ ఆలీ

మహమ్మద్ అలీ విశ్వ విఖ్యాత బాక్సర్. మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. ఇతని అసలు పేరు క్లాషియస్ క్లే. నల్లజాతివారి హక్కుల కోసం పోరాడిన మాల్కం ఎక్స్ స్ఫూర్తితో ఇస్లాం మతాన్ని స్వీకరించి తనపేరును మార్చుకున్నాడు. పన్నెండేళ్ళ వయసు నుంచే బాక్సింగ్ ను అభ్యసించడం ప్రారంభించాడు. [1]

వ్యాఖ్యలు

[మార్చు]
  • ఇతరులకు సేవ చేయడం అనేది భూమిపై మీ గదికి మీరు చెల్లించే అద్దె.[2]
  • రిస్క్ తీసుకునేంత ధైర్యం లేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు.
  • స్నేహం... అనేది మీరు పాఠశాలలో నేర్చుకునేది కాదు. కానీ మీరు స్నేహం అర్థం నేర్చుకోకపోతే, మీరు నిజంగా ఏమీ నేర్చుకోలేదు.
  • ఊహాశక్తి లేని మనిషికి రెక్కలు ఉండవు.
  • వయసు అనేది మీరు ఏమనుకుంటారో అదే. మీరు అనుకున్నంత వయసులో ఉన్నారు.
  • మీరు పెద్ద పోరాటంలో ఓడిపోతే, అది మీ జీవితమంతా మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. అది మిమ్మల్ని వేధిస్తుంది - మీరు ప్రతీకారం తీర్చుకునే వరకు.


మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.