మూర్ఖుడు
మూర్ఖుడు అంటే అజ్ఞానం, మొండితనం కలవాడు.
వ్యాఖ్యలు
[మార్చు]- మీ స్వంతలాభానికి శత్రువులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఒక కత్తిని పట్టుకున్నప్పుడు పదునైన అంచుని కాకుండా, పిడిని పట్టుకోవాలి, అంచు చేతికి గాయం చేస్తుంది, పిడి మీరు ఆత్మరక్షణ చేసుకునేందుకు పనికివస్తుంది. ఒక మూర్ఖుడు తన స్నేహితుల వల్ల పొందే లాభం కన్నా, ఒక వివేకి శత్రువుల వల్ల పొందే లాభం ఎక్కువ.
- బాల్తసర్ గ్రేషియస్ (1601-1658)
- మూర్ఖులతో జట్టీకి దిగరాదు.
- కె.ఎన్.వై.పతంజలి, గోపాత్రుడు నవలలోంచి, జట్టీ అంటే పోరాటం, ఈ వ్యాఖ్యను వీర బొబ్బిలి అనే కుక్క పాత్ర గోపాత్రుడితో మాట్లాడుతూ చేస్తుంది.
- తివిరి ఇసుమున తైలము తీయవచ్చు/దవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు /తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు / చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
- భర్తృహరి, ఆయన సంస్కృత సుభాషితాలలో ఒక శ్లోకానికి తెలుగు అనువాదం.
- ఇసుకలో నూనెని పిండి తీసినా తీయవచ్చు, ఎండమావిలో నీరు తాగినా తాగొచ్చు, ప్రకృతి విరుద్ధమైన కుందేటికొమ్మునూ సాధించినా సాధించవచ్చు (అసాధ్యమైనా వాటికి ప్రయత్నించి చూడవచ్చు) కానీ చేరి మూర్ఖుని మనస్సును మాత్రం సంతోషింపకూడదు.