బాల్తసర్ గ్రేషియస్
స్వరూపం
బాల్తసర్ గ్రేషియన్ వై మోరలెస్ (జనవరి 8, 1601 - డిసెంబర్ 6, 1658), బాస్తసర్ గ్రేషియస్‌గా ప్రఖ్యాతులైన స్పానిష్ మత సంబంధిత రచయిత. బారోక్ ఎరాలో అత్యంత విశిష్టమైన శైలి కలిగిన వచనం ఆయన స్వంతం.
వ్యాఖ్యలు
[మార్చు]- నువ్వు విజ్ఞానాన్ని సేవకురాలిగా చేసుకోలేకుంటే, ఆమెకు స్నేహితురాలిగా వుండు.
- మీ అధికారికన్నా మెరుగ్గా కనిపించకండి. ఆధిపత్యం ఎప్పుడూ బావుండదు, కానీ ఒక పౌరుడు రాజకుమారుడి మీద చూపించే ఆధిపత్యం, మూర్ఖత్వమే కాదు, ప్రాణానికే ముప్పు తేగలదు. ఆకాశంలో నక్షత్రాలు మనకి ఈ పాఠాన్నే బోధిస్తాయి - అవి సూర్యుడికి చుట్టాలే కావచ్చు, సూర్యుడంత తేజస్సు కలిగి ఉండచ్చు, అయినా అతను ప్రకాశిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల అవి కనిపించవు.
- మీ స్వంతలాభానికి శత్రువులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఒక కత్తిని పట్టుకున్నప్పుడు పదునైన అంచుని కాకుండా, పిడిని పట్టుకోవాలి, అంచు చేతికి గాయం చేస్తుంది, పిడి మీరు ఆత్మరక్షణ చేసుకునేందుకు పనికివస్తుంది. ఒక మూర్ఖుడు తన స్నేహితుల వల్ల పొందే లాభం కన్నా, ఒక వివేకి శత్రువుల వల్ల పొందే లాభం ఎక్కువ.