లాభం
లాభం అంటే అధికంగా సంపద కలసిరావడం. దీనికి వ్యతిరేక పదం నష్టం.
వ్యాఖ్యలు
[మార్చు]- మానవులు లాభంకన్నా, నష్టానికే ఎక్కువ స్పందిస్తారు, రుణం చెల్లిస్తారు. ఎందుకంటే కృతజ్ఞత అనేది ఒక భారం అనిపిస్తుంది, ప్రతీకారం సంతోషాన్ని కలిగిస్తుంది.
- టాసిటస్ (క్రీ.శ.55-120)
- మీ స్వంతలాభానికి శత్రువులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఒక కత్తిని పట్టుకున్నప్పుడు పదునైన అంచుని కాకుండా, పిడిని పట్టుకోవాలి, అంచు చేతికి గాయం చేస్తుంది, పిడి మీరు ఆత్మరక్షణ చేసుకునేందుకు పనికివస్తుంది. ఒక మూర్ఖుడు తన స్నేహితుల వల్ల పొందే లాభం కన్నా, ఒక వివేకి శత్రువుల వల్ల పొందే లాభం ఎక్కువ.
- బాల్తసర్ గ్రేషియస్ (1601-1658)
- సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపదవోయి - గురజాడ అప్పారావు