Jump to content

లూయీ పాశ్చర్

వికీవ్యాఖ్య నుండి
లూయీ పాశ్చర్

లూయీ పాశ్చర్ (ఆంగ్లం Louis Pasteur) (డిసెంబరు 27, 1822 – సెప్టెంబరు 28, 1895) ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త. వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఇతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు. [1]


వ్యాఖ్యలు

[మార్చు]
  • నేను ప్రకృతిని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తానో, సృష్టికర్త పనిని చూసి నేను ఆశ్చర్యపోతాను. సైన్స్ మనుషులను దేవునికి దగ్గర చేస్తుంది.[2]
  • తక్కువ సైన్సు మిమ్మల్ని దేవుని నుండి దూరం చేస్తుంది, కానీ ఎక్కువ సైన్స్ మిమ్మల్ని ఆయన వద్దకు తీసుకువెళుతుంది.
  • సిద్ధమైన మనసుకు అవకాశం అనుకూలిస్తుంది.
  • ఎలా ఆలోచించాలో, ప్రశ్నించాలో తెలుసుకోవడం అన్వేషణ దిశగా మనసుకు మొదటి మెట్టు.
  • విజ్ఞాన శాస్త్రానికి దేశం తెలియదు, ఎందుకంటే జ్ఞానం మానవాళికి చెందినది, ప్రపంచాన్ని ప్రకాశింపజేసే జ్యోతి.
  • నన్ను నా లక్ష్యానికి నడిపించిన రహస్యం చెబుతాను. నా బలం పూర్తిగా నా పట్టుదలలోనే ఉంది.
  • దేన్నైనా నమ్మడం, అది అలా ఉండాలని కోరుకోవడం మనసు అతి పెద్ద వికృతి.


మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.