Jump to content

సోనూ సూద్

వికీవ్యాఖ్య నుండి
సోనూ సూద్

సోనూ సూద్ (జ. జులై 30, 1973) ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. సోనూ సూద్ పంజాబ్ లోని మోగా అనే అనే పట్టణంలో జన్మించాడు. నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. భారతదేశంలో కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్త నిర్బంధం కారణంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని స్వంత ఖర్చులతో వారి ఊర్లకు పంపించడం, అలాగే ఆక్సిజన్ కొరత ఉన్నచోట్ల సిలిండర్లు సమకూర్చడం, ఉపాధి కోల్పోయిన వారికి బ్రతుకు దెరువు చూపించడం లాంటి చర్యలతో వార్తల్లోకి ఎక్కాడు. [1]


వ్యాఖ్యలు

[మార్చు]
  • మన భూమిని రక్షించడానికి తమ కుటుంబాలను విడిచిపెట్టే మన ధైర్యవంతులైన సైనికులే మన దేశానికి నిజమైన హీరోలు అని నేను భావిస్తున్నాను.[2]
  • వలస కార్మికులు మా రోడ్లు, ఇళ్లు, కార్యాలయాల నిర్మాణానికి సహకరించారు. వారు నిరాశ్రయులుగా ఉండటాన్ని చూస్తూ నిలబడలేం.
  • ఫిట్నెస్, జిమ్ చేయడం ప్రతిరోజూ ఉదయం పళ్ళు తోముకోవడం వంటిదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఎటువంటి సాకు లేకుండా స్వయంచాలకంగా రావాలి.
  • ఎవరికైనా సహాయం చేయగలిగినప్పుడే మీరు విజయం సాధిస్తారని మా అమ్మ ఎప్పుడూ చెబుతుంది. కాబట్టి నేను చేయగలిగినదంతా నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మాత్రమే చేయగలనని నేను అనుకుంటున్నాను.
  • హిందీ, ఇంగ్లీషు, తమిళం, తెలుగు సినిమాల్లో నటించాను.
  • నటుడిగా చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్టింగ్ ప్రొఫెషన్ లో నాకంటూ చాలా బాగా రాణిస్తున్నాను. నేను రాజకీయాల్లోకి రాను.


మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=సోనూ_సూద్&oldid=23356" నుండి వెలికితీశారు