సామెతలు - చ

Wikiquote నుండి
సామెతలు
అం అః
క్ష

"చ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి


  • చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు
  • చంకలో బిడ్డ నుంచుకుని, ఊరంతా వెతికినట్లు
  • చక్కనమ్మ చిక్కినా అందమే
  • చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
  • చచ్చిన వాడి పెళ్ళికి వచ్చినంత కట్నం
  • చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
  • చదవేస్తే ఉన్న మతి పోయిందట
  • చదవేస్తే ఉన్న మతి పోయినట్లు
  • చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
  • చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
  • చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్న తరువాత కీకరకాయ
  • చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
  • చనిపోయిన వారి కళ్ళు చారెడు
  • చల్లకొచ్చి ముంత దాచినట్లు
  • చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు
  • చాప క్రింది నీరులా
  • చారలపాపడికి దూదంటి కుచ్చు
  • చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
  • చింత చచ్చినా పులుపు చావనట్టు
  • చిత్తం చెప్పులమీద దృష్టేమో శివుడిమీద
  • చిత్తశుద్ది లేని శివపూజలేల
  • చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
  • చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
  • చెట్టు మీద పిట్టవాలె పిట్టవాలితే పట్టుకొంటే, పట్టుకొంటే గిచ్చుపెట్టే గిచ్చుపెడితే విడిచిపెడితి
  • చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం
  • చెడపకురా చెడేవు
  • చెప్పేవాడికి వినేవాడు లోకువ
  • చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
  • చెముడా అంటే మొగుడా అన్నట్టు
  • చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు
  • చెవిలో జోరీగ
  • చేతకాక మంగళవారమన్నాడంట
  • చేతకాక మద్దెలమీద పడిఏడ్చాడంట / చేతకాక మద్దెలమీద పడిఏడ్చాడంట|ఆడలేక మద్దెల ఓడన్నాడంట
  • చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
  • చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
  • చేసేదేమో శివ పూజలు, దూరేదేమో దొమ్మర గృహాలు
  • చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు...
  • చెరువు మీద అలిగి....స్నానం చేయనట్లు
  • చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు
"http://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_చ&oldid=6756" నుండి వెలికితీశారు