సామెతలు - జ
Wikiquote నుండి
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"జ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
- జన్మకో శివరాత్రి అన్నట్లు
- జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
- జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
- జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
- జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే
- జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
- జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
- జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
- జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు