చీర
చీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది. భారతదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైనది చీర. చీర అత్యంత పొడవైన వస్త్రము; ఇది నాలుగు నుండి తొమ్మిది మీటర్లుంటుంది. చీరను ఎక్కువమంది నడుంచుట్టు కట్టుకొని ఒక చివర భుజం మీదనుండి వెనుకకు వేసుకుంటారు. చీరలోపల క్రిందభాగంలో లంగాను పైభాగంలో రవికె ధరించడం సరైన పద్ధతి.
పాటలు
[మార్చు]- చీరలోని గొప్పదనం తెలుసుకో...పల్లకిలో పెళ్లికూతురు కోసం చంద్రబోస్
- చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా - తూర్పు వెళ్ళే రైలు.
- కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి - సితార - (అసలు ఇది విశ్వనాధ సత్యనారాయణ రచించిన కిన్నెరసాని పాటలు లోని చరణం.)
- చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియ్య, అందమంతా చీరలోనే ఉన్నది - బంగారు బాబు
- వళ్ళంత వయ్యారి కోకా, కళ్ళకు కాటుక రేకా ... - అమెరికా అమ్మాయి
- పట్టుచీర తెస్తననీ పడవేసుకెళ్ళిండే మామా.. - స్వాతిముత్యం
- మొరటోడు నా మొగుడు మోజుపడీ తెచ్చాడు. మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకూ.. - సెక్రటరీ
- సరికొత్త చీర ఊహించినాను - సరదాల సరిగంచు నేయించినాను - ఆరుద్ర