వర్తమాన వ్యాఖ్యలు-1
స్వరూపం
వర్తమాన వ్యాఖ్యలు (పాతవి) |
---|
1, 2, 3, |
- తెలంగాణ తెచ్చేది తెరాస, ఇచ్చేది భాజపా, చచ్చేది కాంగ్రెస్ -- విజయశాంతి.
- నన్ను టాయిలెట్ పేపర్‌లా వాడుకున్నారు-- రాయపాటి సాంబశివరావు (గుంటూరు ఎంపి) కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్య [1]
- తెలంగాణ విషయంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబుకు 2014 ఎన్నికల తర్వాత గుడ్డికన్నే మిగులుతుంది -- జి.కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[2]
- భారతీయ మహిళలకు మరుగుదొడ్ల కంటె సెల్‌ఫోన్లే ముఖ్యం -- జైరాం రమేష్ (కేంద్ర మంత్రి)[3]
- చంద్రబాబు ఓ చచ్చిన పాము, దాన్ని మళ్ళీ మళ్ళీ చంపలేము -- నారాయణ (సీపీఐ కార్యదర్శి)[4]
- ప్రస్తుతం మన పాలకులు జిన్నా కంటె ప్రమాదకరులు -- ప్రవీణ్ తొగాడియా (విశ్వహిందూ పరిషత్తు అధ్యక్షుడు)[5]
- బీసీ మంత్రులు గంగిరెద్దుల్లా తయారౌతున్నారు -- ఆర్.కృష్ణయ్య[6]
- ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫలితాలు వినోద ఛానెళ్ళకు బాగా సరిపోతాయి -- ఎస్.వై.ఖురేషి (ప్రధాన ఎన్నికల అధికారి)[7]
- కొందరు రాతి విగ్రహాలను ఇష్టపడతారు, మేము ప్రజలను ఇష్టపడతాము -- అఖిలేష్ యాదవ్ (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి)[8]
- చంద్రబాబు నాయుడు బుర్ర ట్యూబ్ లైట్ వంటిది-- పొన్నాల లక్ష్మయ్య [9]
- మరో జన్మంటూ ఉంటే అందమైన ఆడపిల్లగా పుట్టాలని ఉంది -- ఫరూక్ అబ్దుల్లా (జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి)[10]
- కాంగ్రెస్ పాలన తుగ్లక్ పాలన లాగా తయారైంది-- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి[11]
- రాహుల్ గాంధీ కన్నా మన్మోహన్ సింగే యువకుడు-- అన్నాహజారే[12]
- కెప్టెన్, వైస్‌కెప్టెన్‌ల సంబంధం భార్యాభర్తల లాంటిది -- రాహుల్ ద్రవిడ్[13]
- తెలుగుదేశం పార్టీలో ఉంటే చచ్చిపోతారు, వచ్చేయండి -- నాగం జనార్థన్ రెడ్డి[14]
- తెలుగుదేశం పార్టీ మా ఆడపడచు -- నందమూరి హరికృష్ణ [15]
- మన్మోహన్ సింగ్ శిలా ప్రతిమలాగా పార్లమెంటులో కూసుంటున్నడు -- కోదండరాం [16]
- హరిత విప్లవం ఓ భ్రాంతి -- సుభాష్ పాలేకర్ (ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు)[17]
- విద్యార్థినులు జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలి -- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి[18]
- వైఎస్ సంతకాల రాజా.. జగన్ వసూళ్ళ రాజా -- ముద్దుకృష్ణమ నాయుడు [19]
- ధోని తెలివైన కెప్టెన్ కాడు -- అజహరుద్దీన్[20]
- ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన ముహుర్తం బాగా లేదనుకుంటాను -- కిరణ్ కుమార్ రెడ్డి[21]
- వై.ఎస్.బతికుంటే జైల్లో ఉండేవాడు -- వి.హనుమంతరావు (రాజ్యసభ సభ్యుడు) [22]
- ఐపీఎల్ కారణంగా బాగా ఆడేవాళ్ళు కాదు, అడ్డంగా బాదేవాళ్లే తయారౌతున్నారు -- అర్జున రణతుంగ[23]
- కాంగ్రెస్ పార్టీ పాడి ఆవు అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి దున్నపోతు లాంటిది -- డొక్కా మాణిక్యవరప్రసాద్ (రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి)[24]
- ప్రజలకు పప్పుబెల్లాలు పంచి కొడుకుకి కోట్ల రూపాయలు దోచిపెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేకర్ రెడ్డి -- చంద్రబాబు నాయుడు[25]
- చంపేవాడికంటే చంపించే వాడే పెద్ద క్రిమినల్ -- వి.హనుమంతరావు (కాంగ్రెస్ సీనియర్ నాయకుడు) [26]
- రావణాసురుడు, నరకాసురుడు, బకాసురుడు, మారీచుడు పురాణాల్లో ఉండేవారు. ఇప్పుడు వారంతా రాష్ట్రంలో పుట్టారు -- చంద్రబాబునాయుడు[27]
- సచిన్‌ను రాజ్యసభకు పంపుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అసలైన డర్టీ పిక్చర్‌కు నిదర్శనం--బాల్ థాకరే[28]
- పార్లమెంటులో 543 రోగిష్టులు కూర్చున్నారు -- బాబా రాందేవ్[29]
- వైఎస్ కుటుంబానికి దేశభక్తి, దైవభక్తి రెండూ లేవు, ఉన్నదల్లా సంపాదన భక్తే -- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (తెదేపా సీనియ నేత)[30]
- కిరణ్ పాలన కుర్చీ కాపాడుకునేందుకే- కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[31]
- కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే కాంగ్రెస్‌కు సమాధి కట్టి స్మారక భవనం కూడా నిర్మిస్తారు-- శంకర్రావు (మాజీ మంత్రి)[32]
- సున్నా వచ్చినా సీట్లెలా ఇస్తారు-- నరసింహన్ (గవర్నర్)[33]
- సాక్షి పత్రిక ఆవిర్భావమే బ్లాక్ డే--టి దేవేందర్ గౌడ్ (తెలుగు దేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు)[34]
- బొండలగడ్డ తెలంగాణ వద్దు, భాగ్యాల తెలంగాణే కావాలి -- గద్దర్ [35]
- జైలుకు పోయేవాడికి జిందాబాద్ ఎందుకు -- వి.హనుమంతరావు [36]
- రాష్ట్రాన్ని పాలించే అధికారం దొంగలకు ఇవ్వొద్దు-- నారాయణ (సీపీఐ కార్యదర్శి)[37]
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీ, సుష్మాస్వరాజ్ ద్వారా ఏర్పాటుకాకపోతే దెయ్యం ఏర్పాటు చేస్తుందా? -- కిషన్ రెడ్డి [38]
- జగన్ హోరో కాదు, విలన్-- చిరంజీవి.[39]
- దురాశపడితే ఎవరికైనా శ్రీకృష్ణజన్మస్థానమే దక్కుతుంది -- ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి[40]
- రిటైర్మెంట్ తర్వాత ఆర్మీకి సేవలందిస్తా -- మహేంద్రసింగ్ ధోని[41]
- వైఎస్సార్ అవినీతికి జగన్ వారసుడు--నారాయణ[42]
- కొందరు అధికారులు పారిశ్రామికవేత్తల వద్ద కుక్కల్లా పనిచేస్తున్నారు--దాడి వీరభద్రారావు (తెదెపా నేత)[43]
- రాష్ట్రంలో తోడేళ్ళ పోరాటం జరుగుతోంది, ప్రజలు మేకల్లా చుట్టూ చేరారు-- జయప్రకాశ్ నారాయణ [44]
- రోజులో 24 గంటలు టాయిలెట్ల అంశానికే వెచ్చిస్తున్నా-- జైరాం రమేష్[45]
- ప్రపంచ చరిత్రలో శవరాజకీయాలు చేయడంలో జగన్‌ను మించినవారు లేరు-- కేటీఆర్.[46]
- గుండా రాజ్యం పోవాలె, గులాబి రాజ్యం రావాలె -- కేసిఆర్ [47]
- ఆశావాదం తప్పు కాదుకాని అవకాశ వాదం తప్పు -- కిషన్ రెడ్డి (రాష్ట్ర భాజపా అధ్యక్షుడు)[48]
- హత్యవల్ల ఒక్క కుటుంబానికే నష్టం కలుగుతుంది, ఆర్థిక నేరగాళ్ల వల్ల వ్యవస్థకే నష్టం కలుగుతుంది-- కిషన్ రెడ్డి (రాష్ట్ర భాజపా అధ్యక్షుడు)[49]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి దినపత్రిక, తేది 22-01-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 05-02-2012
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 18-02-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 21-02-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 25-02-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 02-03-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 05-03-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 07-03-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 12-03-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 18-03-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 17-03-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 17-03-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 28-03-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 28-03-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 30-03-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 31-03-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 02-04-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 03-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 04-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 16-04-2012
- ↑ నమస్తే తెలంగాణ, తేది 20-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 21-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 28-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-04-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 30-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 03-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 05-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 07-05-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 08-05-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 08-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 10-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 11-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 13-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 13-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 18-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 23-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 01-06-2012
- ↑ నమస్తే తెలంగాణ 03-06-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 05-06-2012
- ↑ ఆంధ్రజ్యోతి 07-06-12
- ↑ ఆంధ్రజ్యోతి 08-06-12
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 09-06-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 09-06-2012
- ↑ నమస్తే తెలంగాణ 10-06-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 11-06-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 11-06-2012