ఇల్లు
స్వరూపం
ఇల్లు (Home) మానవులు నివాసం కోసం నిర్మించే ఒక కట్టడం.
ఇంటిపై ఉన్న వ్యాఖ్యలు
[మార్చు]ఇంటిపై ఉన్న సామెతలు
[మార్చు]- ఇంట ఆచారం, బయట అనాచారం.
- ఇంటి కన్నా గుడి పదిలం.
- ఇంటి గుట్టు పెరుమాళ్ళకెరుక.
- ఇంటి గుట్టు లంకకు చేటు.
- ఇంట్లో పిల్లి, వీధిలో పులి.
- ఇరుపోటీల తోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
- ఇల్లలకగానే పండగకాదు
- ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
- ఇల్లాలులేని ఇల్లు దెయ్యాల కొంప.
- ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి ...
- ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
- దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి
- భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట.
- సంతులేని ఇల్లు చావడి కొట్టం
- ఇల్లు ఇచ్చినవాడికి మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
- ఇంటికి ఇత్తడి, పురుగుకు పుత్తడి