మహబూబ్ నగర్
Jump to navigation
Jump to search

మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలో ఒకటి. దక్షిణ తెలంగాణలో రాయలసీమ సరిహద్దుగా కలిగిన జిల్లా. పాలమూరు అని కూడా దీనికి పేరు. కరువు జిల్లాగా తెలుగు నేలలో సుపరిచతం. ఇక్కడ కవులకూ కొదువలేదు.
పాలమూరుపై వ్యాఖ్యలు[మార్చు]
- నీవే దిక్కను వారల నీట ముంచక మంచి పాలముంచు మా పాలమూరు.---[[బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త[2]
- తెలుగు వాకిట పరువంబొలికే కృష్ణవేణి ముఖద్వారం---గోరటి వెంకన్న[3]
- మహబూబ్ నగరాఖ్య మండల భాగమ్ము, ప్రఖ్యాత చరితల భద్రభూమి--మహ్మద్ హుస్సేన్[4].
వెనుకబడిన జిల్లా అని వెక్కిరింత...నిజమే మరి,
ప్రజాకంటకుడైన నిజాం తోక ముడిచేవరకు వెనుకబడిన జిల్లా
వైదుష్యంతో విర్రవీగే వారి వెర్రి కుదిర్చే వరకు వెనుకబడిన జిల్లా
--పల్లెర్ల రామ్మోహనరావు[5].
ఇవీ చూడండి[మార్చు]
- పాలమూరు కూలీపై వ్యాఖ్యలు
- బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త వ్యాఖ్యలు
- అలంపూర్పై వ్యాఖ్యలు
- గద్వాలపై వ్యాఖ్యలు
మూలాలు[మార్చు]
- ↑ మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, సంపాదకులు:బి.ఎన్. శాస్త్రి; (మహబూబ్ నగర్ జిల్లా ప్రశస్తి-మహ్మద్ హుస్సేన్), మూసి పబ్లికేషన్స్, హైదరాబాడ్,1993, పుట -3
- ↑ మా పాలమూరు, నవ్య జగత్తు, రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్, పుట-9
- ↑ w:బందూకు సినిమాకు రాసిన 'పూసిన పున్నమి వెన్నెల మేన ' అను పాటలో...
- ↑ మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, సంపాదకులు:బి.ఎన్. శాస్త్రి; (మహబూబ్ నగర్ జిల్లా ప్రశస్తి-మహ్మద్ హుస్సేన్), మూసి పబ్లికేషన్స్, హైదరాబాడ్,1993, పుట -3
- ↑ పాలమూరు కవిత,(మా పాలమూరు-పల్లెర్ల), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్,, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-54