ఈ రోజు వ్యాఖ్యలు నవంబరు 2013
Appearance
నవంబరు 2013 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- నవంబరు 1, 2013:అనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన
- నవంబరు 4, 2013:తూర్పు తూర్పే పడమర పడమరే, అవి ఎన్నటికీ కలవవు -- రుడ్యార్డ్ కిప్లింగ్
- నవంబరు 5, 2013:దిగిరాను దిగిరాను దివినుంచి భువికి... -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- నవంబరు 6, 2013:దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు -- భగత్ సింగ్
- నవంబరు 7, 2013:నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. -- సిగ్మండ్ ఫ్రాయిడ్
- నవంబరు 8, 2013:నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు -- ఆరుద్ర
- నవంబరు 9, 2013:ఉదయం కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ -- కాళోజీ నారాయణరావు
- నవంబరు 10, 2013:భూమి మీద మనిషంత గొప్పవాడు ఎవాడూ లేడు, మనిషిలో మెదడంత గొప్ప అవయవం మరొకటి లేదు-- విలియం హామిల్టన్
- నవంబరు 12, 2013:కాలం గడుస్తున్న కొద్దీ భార్యలు ఆకర్షణ కోల్పోతారు-- ప్రకాష్ జైస్వాల్.
- నవంబరు 17, 2013:వివేకులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు -- అబ్రహాం లింకన్
- నవంబరు 18, 2013:అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు. -- సి.నారాయణరెడ్డి
- నవంబరు 19, 2013:ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.--ఆల్బర్ట్ ఐన్స్టీన్
- నవంబరు 20, 2013:కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
- నవంబరు 22, 2013:జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
- నవంబరు 24, 2013:నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు -- ముస్సోలినీ
- నవంబరు 25, 2013:నాకు మనుషులందరూ సమానమే, అందరినీ సమానంగా ధ్వేషిస్తాను -- జీన్ పాల్ సార్ట్రే
- నవంబరు 26, 2013:పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు -- వేమన