ఈ రోజు వ్యాఖ్యలు జూన్ 2012
స్వరూపం
జూన్ 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- జూన్ 4, 2010:కళింకిత హృదయులకు అధ్యాత్మిక వికాసం ఉండదు -- స్వామీ వివేకానంద
- జూన్ 5, 2010:ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారౌతాడు -- మహాత్మా గాంధీ
- జూన్ 6, 2010:దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు -- భగత్ సింగ్
- జూన్ 7, 2010:నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు -- ఆరుద్ర
- జూన్ 8, 2010:పిరికివాళ్ళు చావడానికి ముందు అనేకసార్లు చస్తుంటారు -- విలియం షేక్స్పియర్
- జూన్ 9, 2010:చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా. -- వేమన
- జూన్ 10, 2010:తెలివి కల వారంతా తెలుగువారేనోయ్ -- జి.వి.కృష్ణారావు
- జూన్ 11, 2010:నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. -- సిగ్మండ్ ఫ్రాయిడ్
- జూన్ 12, 2010:పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం -- డెంగ్ జియాఓపింగ్
- జూన్ 14, 2010:ప్రజలను ప్రేమించలేనివాడు దేశభక్తుడు కాలేడు -- టంగుటూరి ప్రకాశం
- జూన్ 15, 2010:ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న -- మదర్ థెరీసా
- జూన్ 16, 2010:భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు. --ఆర్థర్ లూయీస్
- జూన్ 17, 2010:మాకులానికి అంతా బావలే. -- కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర..
- జూన్ 18, 2010:మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. --ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- జూన్ 19, 2010:సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- జూన్ 25, 2010:తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?--శ్రీశ్రీ
- జూన్ 26, 2010:పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది -- మహాత్మాగాంధీ
- జూన్ 27, 2010:తెలుగువారికి తమిళ సినిమా ఎంత అర్థమౌతుందో నాస్తికుడికి అధ్యాతికత అంతే అర్థమౌతుంది -- సత్యసాయిబాబా
- జూన్ 28, 2010:అవినీతికి పాల్బడినవారికి ఉరే సరైన శిక్ష -- బాబా రాందేవ్
- జూన్ 29, 2010:విప్లవం అనేది డిన్నర్ పార్టీలాంటిది కాదు -- మావో
- జూన్ 30, 2010:తీసుకోవడమే కాదు - ఇవ్వడం కూడా నేర్చుకో -- రామకృష్ణ పరమహంస