ఈ రోజు వ్యాఖ్యలు ఆగష్టు 2009

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

ఆగష్టు 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు".

 • ఆగష్టు 2, 2009: కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు. --విలియం షేక్స్‌పియర్
 • ఆగష్టు 3, 2009: జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. --మేరీ క్యూరీ
 • ఆగష్టు 5, 2009: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. --మదర్ థెరీసా
 • ఆగష్టు 6, 2009: నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. --ముస్సోలినీ
 • ఆగష్టు 10, 2009: సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది. --నవజ్యోత్ సింగ్ సిద్ధూ
 • ఆగష్టు 12, 2009: నిర్మాణాత్మక పని లేని సత్యాగ్రహం, క్రియలేని వాక్యం లాంటిది. --రాంమనోహర్ లోహియా
 • ఆగష్టు 14, 2009: 10మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. --స్వామీ వివేకానంద
 • ఆగష్టు 15, 2009: కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా --వేమన
 • ఆగష్టు 17, 2009: మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. --జో బ్రాండ్.
 • ఆగష్టు 18, 2009: నిజమైన ప్రేమకు అవరోధం లేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. --మదర్ థెరీసా
 • ఆగష్టు 19, 2009: పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం. --డెంగ్ జియాఓపింగ్
 • ఆగష్టు 22, 2009: కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. --మహాత్మా గాంధీ
 • ఆగష్టు 23, 2009: వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది. --నవజ్యోత్ సింగ్ సిద్ధూ
 • ఆగష్టు 26, 2009: నిజాయితీ గల ధైర్యవంతులకు క్షమాగుణం ఉంటుంది. --ఇందిరా గాంధీ


ఇవి కూడా చూడండి[మార్చు]