ఈ రోజు వ్యాఖ్యలు జూలై 2009

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

జూలై 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు".

  • జూలై 2, 2009: చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి. --నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • జూలై 3, 2009: కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు. --శ్రీశ్రీ
  • జూలై 4, 2009: నిర్మాణాత్మక పని లేని సత్యాగ్రహం, క్రియలేని వాక్యం లాంటిది. --రాంమనోహర్ లోహియా
  • జూలై 5, 2009: స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు. --రూసో
  • జూలై 6, 2009: నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా. --లాలు ప్రసాద్ యాదవ్
  • జూలై 8, 2009: మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాను. --సుభాష్ చంద్ర బోస్
  • జూలై 11, 2009: సప్లయి తనకు తగిన డిమాండును తానే సృష్టించుకుంటుంది. --జె.బి.సే
  • జూలై 13, 2009: నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. --అబ్రహం లింకన్
  • జూలై 15, 2009: మనవాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందంటే... సైకిల్ స్టాండులో ఒక్ సైకిల్ నెట్టేస్టే మిగితావన్నీ పడిపోయేట్టు.--నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • జూలై 18, 2009: ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. --అనీబీసెంట్
  • జూలై 19, 2009: మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. --అరిస్టాటిల్
  • జూలై 21, 2009: స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం. --ముస్సోలినీ
  • జూలై 22, 2009: ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. --స్వామీ వివేకానంద
  • జూలై 25, 2009: నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని. --మార్క్ ట్వెయిన్
  • జూలై 26, 2009: మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. --ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
  • జూలై 28, 2009: కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. --మహాత్మా గాంధీ
  • జూలై 29, 2009: మన వాళ్ళుత్త వెధవాయిలోయ్. --కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర.
  • జూలై 30, 2009: నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. --ముస్సోలినీ

ఇవి కూడా చూడండి[మార్చు]