బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త
స్వరూపం
బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తెలుగు కవి. ఈ కవి స్వస్థలం జిల్లాలోని బిజినేపల్లి. ఇంటి పేరు బాదం, అయినా తన ఊరిపేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. సొంతూరులో గ్రంథాలయాన్ని స్థాపించాడు. నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో సైతం పాల్గొని, జైలు జీవితాన్ని అనుభవించాడు. జాతీయ విప్లవం, సామాజిక చైతన్యం, మానసిక పరివర్తనం వర్ధిల్లాలనేదే ఈ కవి ఆశయం, ఆకాంక్ష.
బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్త వ్యాఖ్యలు
[మార్చు]- ఆశ్రయం లేనిదే కవిత,వనిత, లత శోభించజాలవు
- వాణిని నేను, లలిత రాగమయ వీణీయ నేను
- లాలన నేను ఈ సృష్టి ప్రగతికి మూలం నేను.
- జీవితం సహారా ఎడారి కాదు- చిగురించే స్వభావం కలది.
- కవులు లేని దేశం- ఖజానా లేని కోశం.
- అధిక సంతతి - అపస్రవంతి
- కంటి లోని మచ్చ అదృష్టం- ఇంటికొచ్చే మచ్చ అరిష్టం.
- సుయోధనడు లేకుండిన సుగుణుడెట్లు ధర్మజుండు?
- మనుషులంతా ఒకటే- కాని ముఖాలు ఒకటి కావు
కొన్ని గోముఖ వ్యాఘ్రాలు, కొన్ని అశ్వముఖ గార్ధభాలు, మరి కొన్ని హరిముఖ జంబుకాలు.
- భారతమాత గురించి
- వీరభోగ్య వసుంధరా! పేరబరగు భారతాంబరో నేనెంత ప్రస్తుతింప!
- పాలమూరు గురించి
- నీవే దిక్కను వారల నీట ముంచక మంచి పాలముంచు మా పాలమూరు
- గద్వాల గురించి
- విద్వాంసులకు ఉనికి మా గద్వాల పురం - మా పాలమూరునకు ముత్యాల సరం.
- అలంపూర్ గురించి
- దక్షిణ కాశిగా తలకొనియు చరిత్ర వెలుగు నాలంపుర తుల యదేది?
మూలాలు
[మార్చు]- నవ్య జగత్తు, రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్.