ఈ రోజు వ్యాఖ్యలు సెప్టెంబర్ 2009
స్వరూపం
సెప్టెంబర్ 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు".
- సెప్టెంబర్ 1, 2009: అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. -- సి.నారాయణరెడ్డి
- సెప్టెంబర్ 2, 2009: ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది. -- ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
- సెప్టెంబర్ 3, 2009: గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...-- నన్నయ
- సెప్టెంబర్ 4, 2009: తూర్పు తూర్పే పడమర పడమరే, అవి ఎన్నటికీ కలవవు. -- రుడ్యార్డ్ కిప్లింగ్
- సెప్టెంబర్ 5, 2009: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. -- మదర్ థెరీసా
- సెప్టెంబర్ 6, 2009: మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు. -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- సెప్టెంబర్ 7, 2009: సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- సెప్టెంబర్ 8, 2009: స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు. -- రూసో
- సెప్టెంబర్ 9, 2009: భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు. -- ఆర్థర్ లూయీస్
- సెప్టెంబర్ 10, 2009: కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా -- వేమన
- సెప్టెంబర్ 11, 2009: తెలివి కల వారంతా తెలుగువారేనోయ్ -- జి.వి.కృష్ణారావు
- సెప్టెంబర్ 12, 2009: పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం. -- డెంగ్ జియాఓపింగ్
- సెప్టెంబర్ 13, 2009: మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం. -- స్వామీ వివేకానంద
- సెప్టెంబర్ 14, 2009: ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. -- అనీబీసెంట్
- సెప్టెంబర్ 15, 2009: కళింకిత హృదయులకు ఉధ్యాత్మిక వికాసం ఉండదు. -- స్వామీ వివేకానంద
- సెప్టెంబర్ 16, 2009: చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- సెప్టెంబర్ 17, 2009: దిగిరాను దిగిరాను దివినుంచి భువికి... -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- సెప్టెంబర్ 18, 2009: పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది. -- లియోనార్డో డావిన్సీ
- సెప్టెంబర్ 19, 2009: మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- సెప్టెంబర్ 20, 2009: ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది. -- స్వామీ వివేకానంద
- సెప్టెంబర్ 21, 2009: కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. -- మహాత్మా గాంధీ
- సెప్టెంబర్ 22, 2009: కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు. --శ్రీశ్రీ
- సెప్టెంబర్ 23, 2009: జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
- సెప్టెంబర్ 24, 2009: నిరంతర అప్రమత్తతే స్వేచ్ఛకు మూలం. -- జాన్ స్టూవర్ట్ మిల్
- సెప్టెంబర్ 25, 2009: మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు.-- అరిస్టాటిల్
- సెప్టెంబర్ 26, 2009: వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- సెప్టెంబర్ 27, 2009: 10మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. -- స్వామీ వివేకానంద
- సెప్టెంబర్ 28, 2009: ఆల్కహాల్ నా నుంచి తీసుకున్నదాని కంటే నేను దాన్నుంచి పొందిందే ఎక్కువ.-- చర్చిల్
- సెప్టెంబర్ 29, 2009: చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. -- మార్క్ ట్వెయిన్
- సెప్టెంబర్ 28, 2009: ఆల్కహాల్ నా నుంచి తీసుకున్నదాని కంటే నేను దాన్నుంచి పొందిందే ఎక్కువ.-- చర్చిల్
- సెప్టెంబర్ 30, 2009: దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. -- భగత్ సింగ్