ఈ రోజు వ్యాఖ్యలు సెప్టెంబరు 2012

వికీవ్యాఖ్య నుండి

సెప్టెంబరు 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • సెప్టెంబరు 1, 2012:గవర్నర్ పదవి ప్రీ రిటైర్మెంట్-- కొణిజేటి రోశయ్య.
  • సెప్టెంబరు 2, 2012:తెలంగాణ నినాదం కాదు, రాష్ట్రం-- బండారు దత్తాత్రేయ.
  • సెప్టెంబరు 3, 2012:500 వర్సిటీలున్నా నోబెల్ గ్రహీతలు లేరు-- చుక్కారామయ్య
  • సెప్టెంబరు 4, 2012:గణితమంటే అంకెలు కాదు-- చుక్కారామయ్య.
  • సెప్టెంబరు 5, 2012:కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా -- వేమన
  • సెప్టెంబరు 7, 2012:మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.--భగత్ సింగ్
  • సెప్టెంబరు 9, 2012:బ్రాహ్మణుడు, ముస్లిం ఒకే మట్టితో చేసిన వేర్వేరు పాత్రలు -- కబీరు
  • సెప్టెంబరు 12, 2012:బాంబుదాడుల ఉద్దేశ్యం ప్రజలను బలితీసుకోవడం కాదు, బ్రిటీష్ దాస్యశృఖంలాల నుంచి భరతమాతను విడిపించడం-- భగత్ సింగ్
  • సెప్టెంబరు 13, 2012:అధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గంలోనే సాధ్యమౌతుంది -- సత్యసాయిబాబా
  • సెప్టెంబరు 16, 2012:ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలను ఉతికి పారేయడమే ప్రజాస్వామ్యం-- ఆస్కార్ వైల్డ్.
  • సెప్టెంబరు 18, 2012:ఉదయం కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ -- కాళోజీ నారాయణరావు
  • సెప్టెంబరు 19, 2012:ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు.--జాన్ మేజర్
  • సెప్టెంబరు 20, 2012:జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
  • సెప్టెంబరు 21, 2012:నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు -- ముస్సోలినీ
  • సెప్టెంబరు 22, 2012:మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. --జో బ్రాండ్.
  • సెప్టెంబరు 23, 2012:ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు. -- అబ్రహం లింకన్
  • సెప్టెంబరు 24, 2012:ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం -- శ్రీశ్రీ
  • సెప్టెంబరు 25, 2012:ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేసుకోకపోతే పొలీటీయన్ కానేరడోయ్--గురజాడ అప్పారావు
  • సెప్టెంబరు 26, 2012:రాయిలోనూ, బొమ్మలోనూ భగవంతుడిని చూడు, కాని భగవంతుడిని రాయిలాగా, బొమ్మలాగా చూడకు -- సత్యసాయిబాబా
  • సెప్టెంబరు 27, 2012:అన్నా హజారే గాంధేయవాదే కాని గాంధీ కాదు -- అరుందతీ రాయ్.
  • సెప్టెంబరు 28, 2012:భూమధ్యరేఖకు పైనా, కిందా అభివృద్ధిచెందిన దేశం ఒక్కటీ లేదు. -- గాల్‌బ్రెత్
  • సెప్టెంబరు 29, 2012:ఏప్రిల్ ఫూల్స్ డే... మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు. -- మార్క్ ట్వెయిన్
  • సెప్టెంబరు 30, 2012:భూమి మీద మనిషంత గొప్పవాడు ఎవాడూ లేడు, మనిషిలో మెదడంత గొప్ప అవయవం మరొకటి లేదు-- విలియం హామిల్టన్

ఇవి కూడా చూడండి[మార్చు]