ఈ రోజు వ్యాఖ్యలు ఆగష్టు 2012
స్వరూపం
ఆగష్టు 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- ఆగష్టు 1, 2010:నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా -- లాలు ప్రసాద్ యాదవ్
- ఆగష్టు 2, 2010:నాకు మనుషులందరూ సమానమే, అందరినీ సమానంగా ధ్వేషిస్తాను -- జీన్ పాల్ సార్ట్రే
- ఆగష్టు 3, 2010:పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి. -- శ్రీశ్రీ
- ఆగష్టు 4, 2010:మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం -- స్వామీ వివేకానంద
- ఆగష్టు 5, 2010:మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. -- అరిస్టాటిల్
- ఆగష్టు 6, 2010:వేదకాలానికి తరలిపోండి.. -- స్వామీ వివేకానంద
- ఆగష్టు 7, 2010:సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఆగష్టు 8, 2010:స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు -- రూసో
- ఆగష్టు 9, 2010:కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి.-- బసవరాజు అప్పారావు.
- ఆగష్టు 10, 2010:మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను -- శ్రీశ్రీ
- ఆగష్టు 11, 2010:పెళ్ళిళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు -- గురజాడ అప్పారావు
- ఆగష్టు 12, 2010:కోలా మత్లబ్ టాయిలెట్ క్లీనర్ -- బాబా రాందేవ్
- ఆగష్టు 13, 2010:వేయి పూలు పూయనీయండి -- మావో
- ఆగష్టు 14, 2010:ఆరోగ్యం విలువ తెలిసేది అనారోగ్యంలోనే -- ఆది శంకరాచార్యుడు
- ఆగష్టు 15, 2010:ఆలోచనా పరుడికి మరణం ఉండవచ్చు కాని ఆలోచన వేలమందికి స్పూర్తినిస్తుంది -- సుభాష్ చంద్ర బోస్
- ఆగష్టు 16, 2010:ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం గాంధీ మార్గమే సరిపోదు. ఛత్రపతి శివాజీ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది -- అన్నా హజారే
- ఆగష్టు 17, 2010:మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు -- ఆది శంకరాచార్యుడు
- ఆగష్టు 18, 2010:కంటిని నమ్మాలి కాని చెవిని నమ్మకూడదు -- హెరడోటస్
- ఆగష్టు 19, 2010:పెళ్ళి చేసుకోవడం సులభం, కాపురం చేయడమే కష్టం-- రాబర్ట్ ఫ్లాక్.
- ఆగష్టు 20, 2010:భారతీయ మహిళలకు మరుగుదొడ్ల కంటె సెల్‌ఫోన్లే ముఖ్యం -- జైరాం రమేష్
- ఆగష్టు 21, 2010:ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక -- కాళోజీ నారాయణరావు
- ఆగష్టు 22, 2010:వివేకులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు -- అబ్రహాం లింకన్
- ఆగష్టు 23, 2010:ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది. --ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
- ఆగష్టు 24, 2010:ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం --శ్రీశ్రీ
- ఆగష్టు 25, 2010:ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి -- అరిస్టాటిల్
- ఆగష్టు 26, 2010:కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు. -- సి.నారాయణరెడ్డి
- ఆగష్టు 27, 2010:కోపమున ఘనత కొంచెమైపోవును -- వేమన
- ఆగష్టు 28, 2010:నేను వేయబోతున్న ఒక చిన్న అడుగు, మానవాళి వేయబోతున్న పెద్ద ముందడుగు -- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
- ఆగష్టు 29, 2010:పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు -- వేమన
- ఆగష్టు 30, 2010:ప్రజాస్వామ్యం, సోషలిజం రెండూ మార్గాలే కాని గమ్యాలు కావు. -- జవహార్ లాల్ నెహ్రూ
- ఆగష్టు 31, 2010:మనకు ఎంపిక చేసే ప్రధాని కాదు, ఎన్నికయ్యే ప్రధాని కావాలి. -- లాల్ కృష్ణ అద్వానీ