ఈ రోజు వ్యాఖ్యలు జనవరి 2010
స్వరూపం
జనవరి 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- జనవరి 1, 2010:అప్పులేనివాడె యధిక సంపన్నుడు. --వేమన
- జనవరి 2, 2010:పది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. -- స్వామీ వివేకానంద
- జనవరి 3, 2010:ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది. -- స్వామీ వివేకానంద
- జనవరి 4, 2010:భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు. -- ఆర్థర్ లూయీస్
- జనవరి 5, 2010:మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు.-- అరిస్టాటిల్
- జనవరి 6, 2010:వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- జనవరి 7, 2010:హీనంగా చూడకు దేనీ, కవితామయమోయ్ అన్నీ. --శ్రీశ్రీ
- జనవరి 8, 2010:ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు. -- అబ్రహం లింకన్
- జనవరి 9, 2010:ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో! -- మార్క్ ట్వెయిన్
- జనవరి 10, 2010:జై జవాన్ జై కిసాన్.-- లాల్ బహదూర్ శాస్త్రి
- జనవరి 11, 2010:స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం. -- ముస్సోలినీ
- జనవరి 12, 2010:సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- జనవరి 13, 2010:ఇతరుల సలహాపై ఆధారపడకు, నీ ఆలోచనలను నువ్వు అనుసరించు. -- విలియం షేక్స్పియర్
- జనవరి 14, 2010:మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. -- జో బ్రాండ్.
- జనవరి 15, 2010:విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు -- రూసో
- జనవరి 16, 2010:వేదకాలానికి తరలిపోండి.. -- స్వామీ వివేకానంద
- జనవరి 17, 2010:సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము.- -గౌతమ బుద్ధుడు
- జనవరి 18, 2010:అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు. -- సి.నారాయణరెడ్డి
- జనవరి 19, 2010:ఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు. -- జయప్రకాష్ నారాయణ (లోక్‌సత్తా)
- జనవరి 20, 2010:జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. -- అటల్ బిహారీ వాజపేయి
- జనవరి 21, 2010:నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. -- ముస్సోలినీ
- జనవరి 22, 2010:నేను వేయబోతున్న ఒక చిన్న అడుగు, మానవాళి వేయబోతున్న పెద్ద ముందడుగు.-- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
- జనవరి 23, 2010:పిరికివాళ్ళు చావడానికి ముందు అనేకసార్లు చస్తుంటారు. -- విలియం షేక్స్పియర్
- జనవరి 24, 2010:పురుషులందు పుణ్య పురుషులు వేరయ. -- వేమన
- జనవరి 25, 2010:ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?-- శ్రీశ్రీ
- జనవరి 26, 2010:మనకు ఎంపిక చేసే ప్రధాని కాదు, ఎన్నికయ్యే ప్రధాని కావాలి. -- లాల్ కృష్ణ అద్వానీ
- జనవరి 27, 2010:మైదానంలో వీక్షించేందుకు సచిన్ టెండుల్కర్ బ్యాట్ కంటె అద్భుతమైన వస్తువు మరొకటి ఉండదు -- హర్ష భోగ్లే.
- జనవరి 28, 2010:ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారౌతాడు. -- మహాత్మా గాంధీ
- జనవరి 29, 2010:ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే. -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- జనవరి 30, 2010:కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
- జనవరి 31, 2010:సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. -- స్వామీ వివేకానంద