ఈ రోజు వ్యాఖ్యలు ఫిబ్రవరి 2010
స్వరూపం
ఫిబ్రవరి 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- ఫిబ్రవరి 1, 2010:ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు .-- జాన్ మేజర్
- ఫిబ్రవరి 2, 2010:కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు. -- సి.నారాయణరెడ్డి
- ఫిబ్రవరి 3, 2010:కోపమున ఘనత కొంచెమైపోవును-- వేమన
- ఫిబ్రవరి 4, 2010:తూర్పు తూర్పే పడమర పడమరే, అవి ఎన్నటికీ కలవవు. -- రుడ్యార్డ్ కిప్లింగ్
- ఫిబ్రవరి 5, 2010:దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.--స్వామీ వివేకానంద
- ఫిబ్రవరి 6, 2010:నిజమైన ప్రేమకు అవరోధం లేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. -- మదర్ థెరీసా
- ఫిబ్రవరి 7, 2010:ప్రజలను ప్రేమించలేనివాడు దేశభక్తుడు కాలేడు -- టంగుటూరి ప్రకాశం
- ఫిబ్రవరి 8, 2010:ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది -- .రవీంద్రనాథ్ ఠాగూర్
- ఫిబ్రవరి 9, 2010:మనవాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందంటే... సైకిల్ స్టాండులో ఒక్ సైకిల్ నెట్టేస్టే మిగితావన్నీ పడిపోయేట్టు. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఫిబ్రవరి 10, 2010:మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. -- అరిస్టాటిల్
- ఫిబ్రవరి 11, 2010:తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి. -- కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర..
- ఫిబ్రవరి 12, 2010:నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా. -- లాలు ప్రసాద్ యాదవ్
- ఫిబ్రవరి 13, 2010:ప్రపంచమే ఒక నాటకరంగం, ప్రజలందరూ అందులో పాత్రధారులే. -- విలియం షేక్స్పియర్
- ఫిబ్రవరి 14, 2010:ప్రేమ బాధలను సహిస్తుంది కాని ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు. --మహాత్మా గాంధీ
- ఫిబ్రవరి 15, 2010:రాహుల్ ద్రవిడ్ గోడ మాత్రమే కాడు అతను కోట - షేన్ వార్న్
- ఫిబ్రవరి 16, 2010:సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఫిబ్రవరి 17, 2010:స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు. -- రూసో
- ఫిబ్రవరి 18, 2010:ప్రజాస్వామ్యం కన్న ఉత్తమమైనపాలన విధానం మరొకటిలేదు -- జవహార్ లాల్ నెహ్రూ
- ఫిబ్రవరి 19, 2010:ప్రేమ వల్ల, జ్ఞానం వల్ల జీవితం స్పూర్తి పొందుతుంది--బెర్ట్రాండ్ రస్సెల్స్
- ఫిబ్రవరి 21, 2010:అనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన
- ఫిబ్రవరి 22, 2010:ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది. --ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
- ఫిబ్రవరి 23, 2010:ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి. -- అరిస్టాటిల్
- ఫిబ్రవరి 24, 2010:తెలుగు, కన్నడ బాషలు ఒకే కొమ్మకు రెండు పువ్వులు, ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు--నిడదవోలు వెంకటరావు.
- ఫిబ్రవరి 25, 2010:నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. -- సిగ్మండ్ ఫ్రాయిడ్
- ఫిబ్రవరి 26, 2010:నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. -- అబ్రహం లింకన్
- ఫిబ్రవరి 27, 2010:మనస్పూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.--ఏ.పి.జె.అబ్దుల్ కలాం
- ఫిబ్రవరి 28, 2010:మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.--భగత్ సింగ్