ఈ రోజు వ్యాఖ్యలు అక్టోబరు 2010

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

అక్టోబరు 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

 • అక్టోబరు 2, 2010: ---> పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది-- మహాత్మాగాంధీ
 • అక్టోబరు 3, 2010: ---> పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు. -- వేమన
 • అక్టోబరు 4, 2010: ---> మాకులానికి అంతా బావలే. -- కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర..
 • అక్టోబరు 5, 2010: ---> వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది. -- క్రౌథర్
 • అక్టోబరు 7, 2010: ---> సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
 • అక్టోబరు 9, 2010: ---> ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. -- బిల్ వాన్
 • అక్టోబరు 11, 2010: ---> ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. -- శ్రీశ్రీ
 • అక్టోబరు 12, 2010: ---> ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో! -- మార్క్ ట్వెయిన్
 • అక్టోబరు 13, 2010: ---> కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
 • అక్టోబరు 14, 2010: ---> తెలివి కల వారంతా తెలుగువారేనోయ్ -- జి.వి.కృష్ణారావు
 • అక్టోబరు 15, 2010: ---> దిగిరాను దిగిరాను దివినుంచి భువికి... --దేవులపల్లి కృష్ణశాస్త్రి
 • అక్టోబరు 17, 2010: ---> నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు. -- ఆరుద్ర
 • అక్టోబరు 18, 2010: ---> స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం. -- ముస్సోలినీ
 • అక్టోబరు 20, 2010: ---> సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. -- స్వామీ వివేకానంద
 • అక్టోబరు 22, 2010: ---> నువ్వు భయపడే దానిపై అవగాహన పెంచుకుంటే నీ భయం పోతుంది. -- మేరీ క్యూరీ
 • అక్టోబరు 23, 2010: ---> ఆ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడి కైన ఖర్చులు, మతలబులు, కైఫీయతులు, ఇవి కాదోయ్‌ చరిత్ర సారం.--శ్రీశ్రీ
 • అక్టోబరు 24, 2010: ---> బాంబుదాడుల ఉద్దేశ్యం ప్రజలను బలితీసుకోవడం కాదు, బ్రిటీష్ దాస్యశృఖంలాల నుంచి భరతమాతను విడిపించడం-- భగత్ సింగ్
 • అక్టోబరు 26, 2010: ---> అప్పులేనివాడె యధిక సంపన్నుడు. --వేమన
 • అక్టోబరు 27, 2010: ---> ఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు. --జయప్రకాష్ నారాయణ (లోక్‌సత్తా)
 • అక్టోబరు 28, 2010: ---> కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. -- మహాత్మా గాంధీ
 • అక్టోబరు 29, 2010: ---> కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు. -- శ్రీశ్రీ
 • అక్టోబరు 30, 2010: ---> తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు. -- వేమన
 • అక్టోబరు 31, 2010: ---> మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్


ఇవి కూడా చూడండి[మార్చు]