ఈ రోజు వ్యాఖ్యలు ఆగష్టు 2010

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

ఆగష్టు 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

 • ఆగష్టు 1, 2010: -->అనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన
 • ఆగష్టు 2, 2010: -->ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి. -- అరిస్టాటిల్
 • ఆగష్టు 3, 2010: -->కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు. -- సి.నారాయణరెడ్డి
 • ఆగష్టు 4, 2010: -->తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి. -- కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర..
 • ఆగష్టు 6, 2010: -->తెలుగు, కన్నడ బాషలు ఒకే కొమ్మకు రెండు పువ్వులు, ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు -- నిడదవోలు వెంకటరావు.
 • ఆగష్టు 7, 2010: -->దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.--స్వామీ వివేకానంద
 • ఆగష్టు 8, 2010: -->నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా. -- లాలు ప్రసాద్ యాదవ్
 • ఆగష్టు 9, 2010: -->నిజమైన ప్రేమకు అవరోధం లేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. -- మదర్ థెరీసా
 • ఆగష్టు 10, 2010: -->పురుషులందు పుణ్య పురుషులు వేరయ. -- వేమన
 • ఆగష్టు 13, 2010: -->ప్రేమ బాధలను సహిస్తుంది కాని ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు. -- మహాత్మా గాంధీ
 • ఆగష్టు 15, 2010: -->భారతీయులు తమలో తాము పోట్లాడుకోవడం మానుకున్నప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వస్తుంది -- మహాత్మా గాంధీ
 • ఆగష్టు 16, 2010: -->ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. -- సర్వేపల్లి రాధాకృష్ణన్
 • ఆగష్టు 19, 2010: -->పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను. -- భగత్ సింగ్
 • ఆగష్టు 20, 2010: -->ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు.-- జాన్ మేజర్
 • ఆగష్టు 21, 2010: -->కోపమున ఘనత కొంచెమైపోవును-- వేమన
 • ఆగష్టు 25, 2010: -->ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. -- స్వామీ వివేకానంద
 • ఆగష్టు 26, 2010: -->చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. -- మార్క్ ట్వెయిన్
 • ఆగష్టు 27, 2010: -->చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా. -- వేమన

ఇవి కూడా చూడండి[మార్చు]