ఈ రోజు వ్యాఖ్యలు ఆగష్టు 2011
స్వరూపం
ఆగష్టు 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- ఆగష్టు 1, 2011: ---> అనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన
- ఆగష్టు 2, 2011: ---> ఆల్కహాల్ నా నుంచి తీసుకున్నదాని కంటే నేను దాన్నుంచి పొందిందే ఎక్కువ -- చర్చిల్
- ఆగష్టు 3, 2011: ---> ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో! -- మార్క్ ట్వెయిన్
- ఆగష్టు 4, 2011: ---> కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
- ఆగష్టు 5, 2011: ---> నేను వేయబోతున్న ఒక చిన్న అడుగు, మానవాళి వేయబోతున్న పెద్ద ముందడుగు -- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
- ఆగష్టు 6, 2011: ---> పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం -- డెంగ్ జియాఓపింగ్
- ఆగష్టు 7, 2011: ---> మనకు ఎంపిక చేసే ప్రధాని కాదు, ఎన్నికయ్యే ప్రధాని కావాలి. -- లాల్ కృష్ణ అద్వానీ
- ఆగష్టు 8, 2011: ---> మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.--భగత్ సింగ్
- ఆగష్టు 9, 2011: ---> మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాను. -- సుభాష్ చంద్ర బోస్
- ఆగష్టు 10, 2011: ---> వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది. -- క్రౌథర్
- ఆగష్టు 11, 2011: ---> సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఆగష్టు 12, 2011: ---> సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము.--గౌతమ బుద్ధుడు
- ఆగష్టు 13, 2011: ---> పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను. -- భగత్ సింగ్
- ఆగష్టు 14, 2011: ---> విప్లవం అనేది డిన్నర్ పార్టీలాంటిది కాదు -- మావో
- ఆగష్టు 15, 2011: ---> ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు -- మహాత్మా గాంధీ
- ఆగష్టు 16, 2011: ---> ఇతరుల సలహాపై ఆధారపడకు, నీ ఆలోచనలను నువ్వు అనుసరించు. -- విలియం షేక్స్పియర్
- ఆగష్టు 17, 2011: ---> శోధించి సాధించాలి అదియే ధీరగుణం -- శ్రీశ్రీ
- ఆగష్టు 18, 2011: ---> ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం -- శ్రీశ్రీ
- ఆగష్టు 19, 2011: ---> ఆహారంలో క్రమశిక్షణ లేకపోవడమే అనారోగ్యానికి మూలం -- సత్యసాయిబాబా
- ఆగష్టు 20, 2011: ---> ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం --శ్రీశ్రీ
- ఆగష్టు 21, 2011: ---> ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి -- అరిస్టాటిల్
- ఆగష్టు 22, 2011: ---> కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది -- మహాత్మా గాంధీ
- ఆగష్టు 23, 2011: ---> నిరంతర అప్రమత్తతే స్వేచ్ఛకు మూలం. -- జాన్ స్టూవర్ట్ మిల్
- ఆగష్టు 24, 2011: ---> మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- ఆగష్టు 25, 2011: ---> మార్పునకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు -- మహాత్మా గాంధీ
- ఆగష్టు 26, 2011: ---> హిందీ - చీనీ భాయీ భాయీ -- జవహార్ లాల్ నెహ్రూ
- ఆగష్టు 27, 2011: ---> వ్యాధిని వైద్యుడు తగ్గిస్తాడు, ప్రకృతి మామూలుగానే నయం చేస్తుంది. -- అరిస్టాటిల్
- ఆగష్టు 28, 2011: ---> పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది -- స్వామీ వివేకానంద
- ఆగష్టు 29, 2011: ---> మైదానంలో వీక్షించేందుకు సచిన్ టెండుల్కర్ బ్యాట్ కంటె అద్భుతమైన వస్తువు మరొకటి ఉండదు -- హర్ష భోగ్లే.
- ఆగష్టు 30, 2011: ---> కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి.-- బసవరాజు అప్పారావు.
- ఆగష్టు 31, 2011: ---> నువ్వు భయపడే దానిపై అవగాహన పెంచుకుంటే నీ భయం పోతుంది. -- మేరీ క్యూరీ