ఈ రోజు వ్యాఖ్యలు జూలై 2011
Appearance
జూలై 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- జూలై 1, 2011: ---> తెలుగువారికి తమిళ సినిమా ఎంత అర్థమౌతుందో నాస్తికుడికి అధ్యాతికత అంతే అర్థమౌతుంది -- సత్యసాయిబాబా
- జూలై 2 2011: ---> అవినీతికి పాల్బడినవారికి ఉరే సరైన శిక్ష -- బాబా రాందేవ్
- జూలై 3, 2011: ---> అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు. -- సి.నారాయణరెడ్డి
- జూలై 4, 2011: ---> ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్ -- గురజాడ అప్పారావు
- జూలై 5, 2011: ---> ఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు -- జయప్రకాష్ నారాయణ (లోక్‌సత్తా)
- జూలై 6, 2011: ---> జై జవాన్ జై కిసాన్ -- లాల్ బహదూర్ శాస్త్రి
- జూలై 7, 2011: ---> తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు -- వేమన
- జూలై 8, 2011: ---> దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు -- భగత్ సింగ్
- జూలై 9, 2011: ---> నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు? -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- జూలై 10, 2011: ---> నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని -- మార్క్ ట్వెయిన్
- జూలై 12, 2011: ---> ప్రేమ బాధలను సహిస్తుంది కాని ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు. -- మహాత్మా గాంధీ
- జూలై 13, 2011: ---> మనస్పూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు -- ఏ.పి.జె.అబ్దుల్ కలాం
- జూలై 14, 2011: ---> మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు -- అరిస్టాటిల్
- జూలై 15, 2011: ---> రాముడు లంకపై దండెత్తినట్లు గాంధీజీ దండి యాత్ర కూడా చరిత్రలో నిలిచిపోతుంది -- మోతీలాల్ నెహ్రూ
- జూలై 16, 2011: ---> వేదకాలానికి తరలిపోండి.. -- స్వామీ వివేకానంద
- జూలై 15, 2011: ---> రాముడు లంకపై దండెత్తినట్లు గాంధీజీ దండి యాత్ర కూడా చరిత్రలో నిలిచిపోతుంది -- మోతీలాల్ నెహ్రూ
- జూలై 17, 2011: ---> సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- జూలై 18, 2011: ---> స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు -- రూసో
- జూలై 19, 2011: ---> నిలబడడానికి ఆధారం చూపించండి, భూమినే పైకెత్తుతా -- ఆర్కిమెడిస్
- జూలై 20, 2011: ---> మాతృభూమికి సేవ చెయ్యని యవ్వనం వృధా -- చంద్రశేఖర్ ఆజాద్
- జూలై 21, 2011: ---> వ్యక్తికి బహువచనం శక్తి--శ్రీశ్రీ
- జూలై 22, 2011: ---> మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం -- గురజాడ అప్పారావు
- జూలై 23, 2011: ---> రాయిలోనూ, బొమ్మలోనూ భగవంతుడిని చూడు, కాని భగవంతుడిని రాయిలాగా, బొమ్మలాగా చూడకు -- సత్యసాయిబాబా
- జూలై 24, 2011: ---> ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు -- బిల్ వాన్
- జూలై 25, 2011: ---> అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. -- సి.నారాయణరెడ్డి
- జూలై 26, 2011: ---> ఉంటే ఉండు లేకుంటే వెళ్ళు -- విలియం షేక్స్పియర్
- జూలై 27, 2011: ---> తెలుగు, కన్నడ బాషలు ఒకే కొమ్మకు రెండు పువ్వులు, ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు -- నిడదవోలు వెంకటరావు.
- జూలై 28, 2011: ---> ఆలోచనా పరుడికి మరణం ఉండవచ్చు కాని ఆలోచన వేలమందికి స్పూర్తినిస్తుంది -- సుభాష్ చంద్ర బోస్
- జూలై 29, 2011: ---> ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. --అనీబీసెంట్
- జూలై 30, 2011: ---> వేయి పూలు పూయనీయండి -- మావో
- జూలై 31, 2011: ---> ప్రజలను ప్రేమించలేనివాడు దేశభక్తుడు కాలేడు -- టంగుటూరి ప్రకాశం