Jump to content

ఈ రోజు వ్యాఖ్యలు ఏప్రిల్ 2010

వికీవ్యాఖ్య నుండి

ఏప్రిల్ 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • ఏప్రిల్ 3, 2010:ఇష్టదైవాన్ని కొలవడమే మోక్షసాధనం. -- రామానుజుడు
  • ఏప్రిల్ 4, 2010:ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. -- శ్రీశ్రీ
  • ఏప్రిల్ 7, 2010:ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. --అనీబీసెంట్
  • ఏప్రిల్ 9, 2010:అప్పులేనివాడె యధిక సంపన్నుడు. --వేమన
  • ఏప్రిల్ 11, 2010:కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు. --శ్రీశ్రీ
  • ఏప్రిల్ 12, 2010:తెలివి కల వారంతా తెలుగువారేనోయ్ -- జి.వి.కృష్ణారావు
  • ఏప్రిల్ 13, 2010:కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి.-- బసవరాజు అప్పారావు.
  • ఏప్రిల్ 14, 2010:కాయలు కాచిన చెట్టు కొమ్మలు వంగి వేలాడుతుంటాయి. గొప్పవాడివి కావాలనుకుంటే వినయంగా, నిరాడంబరంగా ఉండాలి-- రామకృష్ణ పరమహంస
  • ఏప్రిల్ 15, 2010:సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • ఏప్రిల్ 16, 2010:స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం. -- ముస్సోలినీ
  • ఏప్రిల్ 17, 2010:ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు.--మహాత్మా గాంధీ
  • ఏప్రిల్ 18, 2010:సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. -- స్వామీ వివేకానంద
  • ఏప్రిల్ 19, 2010:ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు. -- అబ్రహం లింకన్
  • ఏప్రిల్ 21, 2010:కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. -- మహాత్మా గాంధీ
  • ఏప్రిల్ 23, 2010:తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు. -- వేమన
  • ఏప్రిల్ 25, 2010:నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు. -- ఆరుద్ర
  • ఏప్రిల్ 26, 2010:పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు. -- వేమన
  • ఏప్రిల్ 27, 2010:పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది. -- లియోనార్డో డావిన్సీ
  • ఏప్రిల్ 28, 2010:ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం--శ్రీశ్రీ
  • ఏప్రిల్ 30, 2010:ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో! -- మార్క్ ట్వెయిన్


ఇవి కూడా చూడండి

[మార్చు]