ఈ రోజు వ్యాఖ్యలు మార్చి 2010

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

మార్చి 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

 • మార్చి 5, 2010:ఆల్కహాల్ నా నుంచి తీసుకున్నదాని కంటే నేను దాన్నుంచి పొందిందే ఎక్కువ.-- చర్చిల్
 • మార్చి 7, 2010:ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. -- స్వామీ వివేకానంద
 • మార్చి 8, 2010:చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా. -- వేమన
 • మార్చి 13, 2010:మన వాళ్ళుత్త వెధవాయిలోయ్. -- కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర.
 • మార్చి 14, 2010:మార్పునకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు. -- మహాత్మా గాంధీ
 • మార్చి 15, 2010:మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
 • మార్చి 16, 2010:సర్వస్వం రాజ్యం కొరకే, రాజ్యానికి వ్యతిరేకంగా ఏదీ లేదు. -- ముస్సోలినీ
 • మార్చి 17, 2010:ప్రేమే నా మతం దాని కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను -- జాన్ కీట్స్
 • మార్చి 19, 2010:నువ్వు భయపడే దానిపై అవగాహన పెంచుకుంటే నీ భయం పోతుంది. -- మేరీ క్యూరీ
 • మార్చి 20, 2010:ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి. -- మహాత్మా గాంధీ
 • మార్చి 22, 2010:పొట్టి శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు.-- మహాత్మా గాంధీ
 • మార్చి 23, 2010:మాకులానికి అంతా బావలే. -- కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర..
 • మార్చి 25, 2010:చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. -- మార్క్ ట్వెయిన్
 • మార్చి 27, 2010:పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం. -- డెంగ్ జియాఓపింగ్
 • మార్చి 28, 2010:ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. -- మదర్ థెరీసా
 • మార్చి 29, 2010:ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. --బిల్ వాన్
 • మార్చి 31, 2010:మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను-- శ్రీశ్రీ

ఇవి కూడా చూడండి[మార్చు]