ఈ రోజు వ్యాఖ్యలు జనవరి 2012
స్వరూపం
జనవరి 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- జనవరి 1, 2012:==>అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. -- సి.నారాయణరెడ్డి
- జనవరి 2, 2012:==>ఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు. --జయప్రకాష్ నారాయణ (లోక్‌సత్తా)
- జనవరి 3, 2012:==>ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.--ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- జనవరి 4, 2012:==>గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...-- నన్నయ
- జనవరి 5, 2012:==>తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి. -- కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర..
- జనవరి 6, 2012:==>నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. -- సిగ్మండ్ ఫ్రాయిడ్
- జనవరి 7, 2012:==>ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న -- మదర్ థెరీసా
- జనవరి 8, 2012:==>మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- జనవరి 9, 2012:==>విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు -- రూసో
- జనవరి 10, 2012:==>సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- జనవరి 11, 2012:==>స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం -- ముస్సోలినీ
- జనవరి 12, 2012:==>దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.--స్వామీ వివేకానంద
- జనవరి 13, 2012:==>పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం -- డెంగ్ జియాఓపింగ్
- జనవరి 14, 2012:==>మాకులానికి అంతా బావలే. -- కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర..
- జనవరి 15, 2012:==>సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. -- స్వామీ వివేకానంద
- జనవరి 16, 2012:==>మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను -- శ్రీశ్రీ
- జనవరి 17, 2012:==>ధనం వస్తుంది పోతుంది, జ్ఞానం వస్తుంది పెరుగుతుంది -- సత్యసాయిబాబా
- జనవరి 18, 2012:==>ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. --బిల్ వాన్
- జనవరి 19, 2012:==>అప్పులేనివాడె యధిక సంపన్నుడు. --వేమన
- జనవరి 20, 2012:==>జై జవాన్ జై కిసాన్ -- లాల్ బహదూర్ శాస్త్రి
- జనవరి 21, 2012:==>తూర్పు తూర్పే పడమర పడమరే, అవి ఎన్నటికీ కలవవు -- రుడ్యార్డ్ కిప్లింగ్
- జనవరి 22, 2012:==>నేను వేయబోతున్న ఒక చిన్న అడుగు, మానవాళి వేయబోతున్న పెద్ద ముందడుగు -- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
- జనవరి 23, 2012:==>తెలుగు, కన్నడ బాషలు ఒకే కొమ్మకు రెండు పువ్వులు, ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు--నిడదవోలు వెంకటరావు.
- జనవరి 24, 2012:==>నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు? -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- జనవరి 25, 2012:==>అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు. -- సి.నారాయణరెడ్డి
- జనవరి 26, 2012:==>చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా. -- వేమన
- జనవరి 27, 2012:==>నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. -- అబ్రహం లింకన్
- జనవరి 28, 2012:==>పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి. -- శ్రీశ్రీ
- జనవరి 29, 2012:==>ప్రజలను ప్రేమించలేనివాడు దేశభక్తుడు కాలేడు -- టంగుటూరి ప్రకాశం
- జనవరి 30, 2012:==>మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- జనవరి 31, 2012:==>తీసుకోవడమే కాదు - ఇవ్వడం కూడా నేర్చుకో -- రామకృష్ణ పరమహంస