Jump to content

ఈ రోజు వ్యాఖ్యలు మే 2010

వికీవ్యాఖ్య నుండి

మే 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • మే 1, 2010:చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • మే 4, 2010:జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
  • మే 5, 2010:దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. -- భగత్ సింగ్
  • మే 8, 2010:నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని. -- మార్క్ ట్వెయిన్
  • మే 10, 2010:ప్రజాస్వామ్య స్పూర్తిని ఇతరులెవ్వరూ బలవంతంగా రుద్దలేరు, అది అంతర్గతంగా, స్వతసిద్ధంగా వికసించాల్సి ఉంటుంది.-- మహాత్మా గాంధీ
  • మే 11, 2010:మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. -- జో బ్రాండ్.
  • మే 13, 2010:విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు-- రూసో
  • మే 14, 2010:హీనంగా చూడకు దేనీ, కవితామయమోయ్ అన్నీ. -- శ్రీశ్రీ
  • మే 16, 2010:వ్యాధిని వైద్యుడు తగ్గిస్తాడు, ప్రకృతి మామూలుగానే నయం చేస్తుంది. -- అరిస్టాటిల్
  • మే 17, 2010:నిలబడడానికి ఆధారం చూపించండి, భూమినే పైకెత్తుతా -- ఆర్కిమెడిస్
  • మే 18, 2010:బ్రాహ్మణుడు, ముస్లిం ఒకే మట్టితో చేసిన వేర్వేరు పాత్రలు. -- కబీరు
  • మే 19, 2010:ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం--శ్రీశ్రీ
  • మే 20, 2010:కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా -- వేమన
  • మే 21, 2010:కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు. -- విలియం షేక్స్‌పియర్
  • మే 22, 2010:గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...-- నన్నయ
  • మే 24, 2010:నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. -- ముస్సోలినీ
  • మే 26, 2010:పది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. -- స్వామీ వివేకానంద

ఇవి కూడా చూడండి

[మార్చు]