ఈ రోజు వ్యాఖ్యలు మే 2010
స్వరూపం
మే 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- మే 1, 2010:చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- మే 4, 2010:జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
- మే 5, 2010:దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. -- భగత్ సింగ్
- మే 6, 2010:నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు? -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- మే 7, 2010:నిర్మాణాత్మక పని లేని సత్యాగ్రహం, క్రియలేని వాక్యం లాంటిది. -- రాంమనోహర్ లోహియా
- మే 8, 2010:నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని. -- మార్క్ ట్వెయిన్
- మే 9, 2010:ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది. -- స్వామీ వివేకానంద
- మే 10, 2010:ప్రజాస్వామ్య స్పూర్తిని ఇతరులెవ్వరూ బలవంతంగా రుద్దలేరు, అది అంతర్గతంగా, స్వతసిద్ధంగా వికసించాల్సి ఉంటుంది.-- మహాత్మా గాంధీ
- మే 11, 2010:మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. -- జో బ్రాండ్.
- మే 12, 2010:వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- మే 13, 2010:విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు-- రూసో
- మే 14, 2010:హీనంగా చూడకు దేనీ, కవితామయమోయ్ అన్నీ. -- శ్రీశ్రీ
- మే 16, 2010:వ్యాధిని వైద్యుడు తగ్గిస్తాడు, ప్రకృతి మామూలుగానే నయం చేస్తుంది. -- అరిస్టాటిల్
- మే 17, 2010:నిలబడడానికి ఆధారం చూపించండి, భూమినే పైకెత్తుతా -- ఆర్కిమెడిస్
- మే 18, 2010:బ్రాహ్మణుడు, ముస్లిం ఒకే మట్టితో చేసిన వేర్వేరు పాత్రలు. -- కబీరు
- మే 19, 2010:ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం--శ్రీశ్రీ
- మే 20, 2010:కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా -- వేమన
- మే 21, 2010:కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు. -- విలియం షేక్స్పియర్
- మే 22, 2010:గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...-- నన్నయ
- మే 23, 2010:జై జవాన్ జై కిసాన్.-- లాల్ బహదూర్ శాస్త్రి
- మే 24, 2010:నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. -- ముస్సోలినీ
- మే 25, 2010:నేను వేయబోతున్న ఒక చిన్న అడుగు, మానవాళి వేయబోతున్న పెద్ద ముందడుగు.-- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
- మే 26, 2010:పది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. -- స్వామీ వివేకానంద