ఈ రోజు వ్యాఖ్యలు నవంబరు 2009
Appearance
నవంబరు 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- నవంబరు 1, 2009: ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు.-- జాన్ మేజర్
- నవంబరు 2, 2009: ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి. -- అరిస్టాటిల్
- నవంబరు 3, 2009: కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు. -- సి.నారాయణరెడ్డి
- నవంబరు 4, 2009: నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా. -- లాలు ప్రసాద్ యాదవ్
- నవంబరు 5, 2009: ఉంటే ఉండు లేకుంటే వెళ్ళు. -- విలియం షేక్స్పియర్
- నవంబరు 7, 2009: తెలుగు, కన్నడ బాషలు ఒకే కొమ్మకు రెండు పువ్వులు, ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు--నిడదవోలు వెంకటరావు.
- నవంబరు 8, 2009: నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. -- సిగ్మండ్ ఫ్రాయిడ్
- నవంబరు 9, 2009: మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.--భగత్ సింగ్
- నవంబరు 10, 2009: ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది. -- రవీంద్రనాథ్ ఠాగూర్
- నవంబరు 11, 2009: ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి. -- మహాత్మా గాంధీ
- నవంబరు 12, 2009: దేశ భాషలందు తెలుగు లెస్స -- శ్రీకృష్ణ దేవరాయలు
- నవంబరు 13, 2009: నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. -- అబ్రహం లింకన్
- నవంబరు 14, 2009: ప్రజాస్వామ్యం, సోషలిజం రెండూ మార్గాలే కాని గమ్యాలు కావు. -- జవహార్ లాల్ నెహ్రూ
- నవంబరు 15, 2009: కోపమున ఘనత కొంచెమైపోవును-- వేమన
- నవంబరు 16, 2009: మనస్పూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.--ఏ.పి.జె.అబ్దుల్ కలాం
- నవంబరు 17, 2009: వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది. -- క్రౌథర్
- నవంబరు 18, 2009: కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
- నవంబరు 19, 2009: ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.--ఆల్బర్ట్ ఐన్స్టీన్
- నవంబరు 20, 2009: ప్రేమ బాధలను సహిస్తుంది కాని ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు. --మహాత్మా గాంధీ
- నవంబరు 21, 2009: బుల్లెట్ కంటె బ్యాలెట్ శక్తివంతమైనది. -- అబ్రహం లింకన్
- నవంబరు 22, 2009: మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. -- అరిస్టాటిల్
- నవంబరు 23, 2009: మాకులానికి అంతా బావలే. -- కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర..
- నవంబరు 24, 2009: మార్పునుకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు. -- మహాత్మా గాంధీ
- నవంబరు 25, 2009: మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం. -- స్వామీ వివేకానంద
- నవంబరు 26, 2009: మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాను. -- సుభాష్ చంద్ర బోస్
- నవంబరు 27, 2009: సప్లయి తనకు తగిన డిమాండును తానే సృష్టించుకుంటుంది. -- జె.బి.సే
- నవంబరు 28, 2009: సర్వస్వం రాజ్యం కొరకే, రాజ్యానికి వ్యతిరేకంగా ఏదీ లేదు. -- ముస్సోలినీ
- నవంబరు 29, 2009: ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది. -- ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
- నవంబరు 30, 2009: తూర్పు తూర్పే పడమర పడమరే, అవి ఎన్నటికీ కలవవు. -- రుడ్యార్డ్ కిప్లింగ్