ఈ రోజు వ్యాఖ్యలు ఫిబ్రవరి 2009
స్వరూపం
ఫిబ్రవరి 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు.
- ఫిబ్రవరి 1, 2009: సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే.--నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఫిబ్రవరి 2, 2009: చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం.--మార్క్ ట్వెయిన్
- ఫిబ్రవరి 3, 2009: మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు.--అరిస్టాటిల్
- ఫిబ్రవరి 4, 2009: ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు.--జాన్ మేజర్
- ఫిబ్రవరి 5, 2009: తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.--గురజాడ అప్పారావు
- ఫిబ్రవరి 6, 2009: నైతిక జీవనము రూపొందించుటయే రాజ్యము యొక్క పరమావధి.--అరిస్టాటిల్
- ఫిబ్రవరి 10, 2009: మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు.--ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- ఫిబ్రవరి 11, 2009: జై జవాన్ జై కిసాన్.--లాల్ బహదూర్ శాస్త్రి
- ఫిబ్రవరి 12, 2009: కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు.--విలియం షేక్స్‌పియర్
- ఫిబ్రవరి 13, 2009: వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది.--నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఫిబ్రవరి 14, 2009: స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు.--రూసో
- ఫిబ్రవరి 15, 2009: తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి.--కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర.
- ఫిబ్రవరి 16, 2009: ప్రజాస్వామ్య స్పూర్తిని ఇతరులెవ్వరూ బలవంతంగా రుద్దలేరు, అది అంతర్గతంగా, స్వతసిద్ధంగా వికసించాల్సి ఉంటుంది.--మహాత్మా గాంధీ
- ఫిబ్రవరి 17, 2009: రాజ్యమునకు ఆధారం ప్రజామోదమే కాని బలప్రయోగం కాదు.--థామస్ హిల్ గ్రీన్
- ఫిబ్రవరి 18, 2009: చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం.--మార్క్ ట్వెయిన్
- ఫిబ్రవరి 19, 2009: నైతిక జీవనము రూపొందించుటయే రాజ్యము యొక్క పరమావధి.--అరిస్టాటిల్
- ఫిబ్రవరి 21, 2009: చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం.--మార్క్ ట్వెయిన్
- ఫిబ్రవరి 22, 2009: ప్రార్ధించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న.--మదర్ ధెరెసా
- ఫిబ్రవరి 24, 2009: మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు.--ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- ఫిబ్రవరి 25, 2009: ఆల్కహాల్ నా నుంచి తీసుకున్నదాని కంటే నేను దాన్నుంచి పొందిందే ఎక్కువ.--చర్చిల్
- ఫిబ్రవరి 26, 2009: శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు.--మహాత్మా గాంధీ
- ఫిబ్రవరి 27, 2009: తూర్పు తూర్పే పడమర పడమరే, అవి ఎన్నటికీ కలవవు.--రుడ్యార్డ్ కిప్లింగ్
- ఫిబ్రవరి 28, 2009: ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?--శ్రీశ్రీ