ఈ రోజు వ్యాఖ్యలు మార్చి 2009
Appearance
మార్చి 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు.
- మార్చి 1, 2009: అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు.--సి.నారాయణరెడ్డి
- మార్చి 2, 2009: హిందీ - చీనీ భాయీ భాయీ.--జవహార్ లాల్ నెహ్రూ
- మార్చి 3, 2009: ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్.--గురజాడ అప్పారావు
- మార్చి 4, 2009: ప్రపంచమే ఒక నాటకరంగం, ప్రజలందరూ అందులో పాత్రధారులే.--విలియం షేక్స్పియర్
- మార్చి 5, 2009: స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు.--రూసో
- మార్చి 6, 2009: మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు.--అరిస్టాటిల్
- మార్చి 7, 2009: సప్లయి తనకు తగిన డిమాండును తానే సృష్టించుకుంటుంది.--జె.బి.సే
- మార్చి 8, 2009: దేశభాషలందు తెలుగు లెస్స.--శ్రీకృష్ణదేవరాయలు
- మార్చి 9, 2009: మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు.--ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- మార్చి 10, 2009: ప్రజాస్వామ్య స్పూర్తిని ఇతరులెవ్వరూ బలవంతంగా రుద్దలేరు, అది అంతర్గతంగా, స్వతసిద్ధంగా వికసించాల్సి ఉంటుంది.--మహాత్మా గాంధీ
- మార్చి 11, 2009: పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది.--రవీంద్రనాథ్ ఠాగూర్
- మార్చి 12, 2009: సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే.--నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- మార్చి 13, 2009: తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి.--కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర.
- మార్చి 14, 2009: గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...--నన్నయ
- మార్చి 15, 2009: జై జవాన్ జై కిసాన్.--లాల్ బహదూర్ శాస్త్రి
- మార్చి 16, 2009: నేను వేయబోతున్న ఒక చిన్న అడుగు, మానవాళి వేయబోతున్న పెద్ద ముందడుగు.--నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
- మార్చి 17, 2009: రోం నగరమంత పెద్దదిగాను, సుమ్దరమైనది గాను నాకు విజయనగరం కనిపించింది. --చారిత్రిక పర్యాటకుడు పేస్
- మార్చి 18, 2009: పొట్టి శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు.--మహాత్మా గాంధీ
- మార్చి 19, 2009: నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా.--లాలు ప్రసాద్ యాదవ్
- మార్చి 20, 2009: అనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన
- మార్చి 21, 2009: కేవలం మాటలతో మతం లేదు. మానవులమ్దరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడు. -- గురునానక్
- మార్చి 22, 2009: వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది. -- క్రౌథర్
- మార్చి 23, 2009: దీర్ఘకాలం వర్తమానానికి సరిపడదు. దీర్ఘకాలంలో అందరూ చనిపోయేవారే. -- జాన్ మేనార్డ్ కీన్స్
- మార్చి 24, 2009: ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. -- శ్రీశ్రీ
- మార్చి 25, 2009: నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. --ముస్సోలినీ
- మార్చి 26, 2009: అన్నం లేని దేశంలో ఆసియా క్రీడలా! --నందమూరి తారక రామారావు
- మార్చి 27, 2009: మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- మార్చి 28, 2009: మాకులానికి అంతా బావలే. -- కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర..
- మార్చి 29, 2009: కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్