ఈ రోజు వ్యాఖ్యలు మార్చి 2012
Appearance
మార్చి 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- మార్చి 1, 2012: ---> ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?-- శ్రీశ్రీ
- మార్చి 2, 2012: ---> మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. --జో బ్రాండ్.
- మార్చి 3, 2012: ---> సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము --గౌతమ బుద్ధుడు
- మార్చి 4, 2012: ---> వేయి పూలు పూయనీయండి -- మావో
- మార్చి 5, 2012: ---> మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు -- ఆది శంకరాచార్యుడు
- మార్చి 6, 2012: ---> కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా -- వేమన
- మార్చి 7, 2012: ---> చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- మార్చి 8, 2012: ---> ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది-- గురజాడ అప్పారావు
- మార్చి 9, 2012: ---> కంటిని నమ్మాలి కాని చెవిని నమ్మకూడదు -- హెరడోటస్
- మార్చి 10, 2012: ---> కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు -- శ్రీశ్రీ
- మార్చి 11, 2012: ---> ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక -- కాళోజీ నారాయణరావు
- మార్చి 12, 2012: ---> ఆరోగ్యం విలువ తెలిసేది అనారోగ్యంలోనే -- ఆది శంకరాచార్యుడు
- మార్చి 13, 2012: ---> ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం -- శ్రీశ్రీ
- మార్చి 14, 2012: ---> ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం గాంధీ మార్గమే సరిపోదు. ఛత్రపతి శివాజీ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది -- అన్నా హజారే
- మార్చి 15, 2012: ---> నా తెలంగాణ కోటి రతనాల వీణ -- దాశరథి కృష్ణమాచార్య
- మార్చి 16, 2012: ---> మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.--భగత్ సింగ్
- మార్చి 17, 2012: ---> పెళ్ళిళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు -- గురజాడ అప్పారావు
- మార్చి 18, 2012: ---> ఆలోచనా పరుడికి మరణం ఉండవచ్చు కాని ఆలోచన వేలమందికి స్పూర్తినిస్తుంది -- సుభాష్ చంద్ర బోస్
- మార్చి 19, 2012: ---> ఉదయం కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ -- కాళోజీ నారాయణరావు
- మార్చి 20, 2012: ---> వివేకులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు -- అబ్రహాం లింకన్
- మార్చి 21, 2012: ---> భారతీయ మహిళలకు మరుగుదొడ్ల కంటె సెల్‌ఫోన్లే ముఖ్యం -- జైరాం రమేష్
- మార్చి 22, 2012: ---> మరో జన్మంటూ ఉంటే అందమైన ఆడపిల్లగా పుట్టాలని ఉంది -- ఫరూక్ అబ్దుల్లా (జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి)
- మార్చి 23, 2012: ---> ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు.--జాన్ మేజర్
- మార్చి 24, 2012: ---> ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. -- స్వామీ వివేకానంద
- మార్చి 25, 2012: ---> జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
- మార్చి 26, 2012: ---> తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు -- వేమన
- మార్చి 27, 2012: ---> దిగిరాను దిగిరాను దివినుంచి భువికి... -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- మార్చి 28, 2012: ---> నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు -- ముస్సోలినీ
- మార్చి 29, 2012: ---> నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు -- ఆరుద్ర
- మార్చి 30, 2012: ---> నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని -- మార్క్ ట్వెయిన్