ఈ రోజు వ్యాఖ్యలు సెప్టెంబరు 2011

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

సెప్టెంబరు 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

 • సెప్టెంబరు 1, 2011: ---> ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేసుకోకపోతే పొలీటీయన్ కానేరడోయ్--గురజాడ అప్పారావు
 • సెప్టెంబరు 2, 2011: ---> ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం గాంధీ మార్గమే సరిపోదు. ఛత్రపతి శివాజీ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది -- అన్నా హజారే
 • సెప్టెంబరు 3, 2011: ---> కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా -- వేమన
 • సెప్టెంబరు 4, 2011: ---> చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. --మార్క్ ట్వెయిన్
 • సెప్టెంబరు 5, 2011: ---> ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. -- సర్వేపల్లి రాధాకృష్ణన్
 • సెప్టెంబరు 6, 2011: ---> ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం -- శ్రీశ్రీ
 • సెప్టెంబరు 7, 2011: ---> బాంబుదాడుల ఉద్దేశ్యం ప్రజలను బలితీసుకోవడం కాదు, బ్రిటీష్ దాస్యశృఖంలాల నుంచి భరతమాతను విడిపించడం-- భగత్ సింగ్
 • సెప్టెంబరు 9, 2011: ---> మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నిటికీ కారణం-- అంబేద్కర్
 • సెప్టెంబరు 10, 2011: ---> ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారౌతాడు -- మహాత్మా గాంధీ
 • సెప్టెంబరు 11, 2011: ---> ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. -- స్వామీ వివేకానంద
 • సెప్టెంబరు 12, 2011: ---> కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు -- విలియం షేక్స్‌పియర్
 • సెప్టెంబరు 13, 2011: ---> చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
 • సెప్టెంబరు 14, 2011: ---> నిజమైన ప్రేమకు అవరోధం లేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది -- మదర్ థెరీసా
 • సెప్టెంబరు 15, 2011: ---> నిర్మాణాత్మక పని లేని సత్యాగ్రహం, క్రియలేని వాక్యం లాంటిది -- రాంమనోహర్ లోహియా
 • సెప్టెంబరు 16, 2011: ---> ప్రజాస్వామ్య స్పూర్తిని ఇతరులెవ్వరూ బలవంతంగా రుద్దలేరు, అది అంతర్గతంగా, స్వతసిద్ధంగా వికసించాల్సి ఉంటుంది -- మహాత్మా గాంధీ
 • సెప్టెంబరు 17, 2011: ---> నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......

గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడా -- దాశరథి కృష్ణమాచార్య

 • సెప్టెంబరు 19, 2011: ---> ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయీ లెవ్వరు?-- శ్రీశ్రీ
 • సెప్టెంబరు 20, 2011: ---> ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది. -- ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
 • సెప్టెంబరు 21, 2011: ---> కోపమున ఘనత కొంచెమైపోవును -- వేమన
 • సెప్టెంబరు 23, 2011: ---> నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా -- లాలు ప్రసాద్ యాదవ్
 • సెప్టెంబరు 25, 2011: ---> పురుషులందు పుణ్య పురుషులు వేరయ -- వేమన
 • సెప్టెంబరు 26, 2011: ---> బుల్లెట్ కంటె బ్యాలెట్ శక్తివంతమైనది -- అబ్రహం లింకన్
 • సెప్టెంబరు 27, 2011: ---> మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. -- జో బ్రాండ్.
 • సెప్టెంబరు 30, 2011: ---> కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు. -- సి.నారాయణరెడ్డిఇవి కూడా చూడండి[మార్చు]