ఈ రోజు వ్యాఖ్యలు జూలై 2009
స్వరూపం
జూలై 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు".
- జూలై 1, 2009: హిందీ - చీనీ భాయీ భాయీ. --జవహార్ లాల్ నెహ్రూ
- జూలై 2, 2009: చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి. --నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- జూలై 3, 2009: కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు. --శ్రీశ్రీ
- జూలై 4, 2009: నిర్మాణాత్మక పని లేని సత్యాగ్రహం, క్రియలేని వాక్యం లాంటిది. --రాంమనోహర్ లోహియా
- జూలై 5, 2009: స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు. --రూసో
- జూలై 6, 2009: నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా. --లాలు ప్రసాద్ యాదవ్
- జూలై 7, 2009: అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు. --సి.నారాయణరెడ్డి
- జూలై 8, 2009: మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాను. --సుభాష్ చంద్ర బోస్
- జూలై 9, 2009: ఉంటే ఉండు లేకుంటే వెళ్ళు. --విలియం షేక్స్పియర్
- జూలై 10, 2009: ఇష్టదైవాన్ని కొలవడమే మోక్షసాధనం. --రామానుజుడు
- జూలై 11, 2009: సప్లయి తనకు తగిన డిమాండును తానే సృష్టించుకుంటుంది. --జె.బి.సే
- జూలై 12, 2009: అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. --సి.నారాయణరెడ్డి
- జూలై 13, 2009: నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. --అబ్రహం లింకన్
- జూలై 14, 2009: దిగిరాను దిగిరాను దివినుంచి భువికి... --దేవులపల్లి కృష్ణశాస్త్రి
- జూలై 15, 2009: మనవాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందంటే... సైకిల్ స్టాండులో ఒక్ సైకిల్ నెట్టేస్టే మిగితావన్నీ పడిపోయేట్టు.--నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- జూలై 16, 2009: తూర్పు తూర్పే పడమర పడమరే, అవి ఎన్నటికీ కలవవు. --రుడ్యార్డ్ కిప్లింగ్
- జూలై 17, 2009: ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్. --గురజాడ అప్పారావు
- జూలై 18, 2009: ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. --అనీబీసెంట్
- జూలై 19, 2009: మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. --అరిస్టాటిల్
- జూలై 20, 2009: రాజ్యమునకు ఆధారం ప్రజామోదమే కాని బలప్రయోగం కాదు. --థామస్ హిల్ గ్రీన్
- జూలై 21, 2009: స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం. --ముస్సోలినీ
- జూలై 22, 2009: ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. --స్వామీ వివేకానంద
- జూలై 25, 2009: నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని. --మార్క్ ట్వెయిన్
- జూలై 26, 2009: మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. --ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- జూలై 27, 2009: పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది. --లియోనార్డో డావిన్సీ
- జూలై 28, 2009: కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. --మహాత్మా గాంధీ
- జూలై 29, 2009: మన వాళ్ళుత్త వెధవాయిలోయ్. --కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర.
- జూలై 30, 2009: నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. --ముస్సోలినీ
- జూలై 31, 2009: ప్రపంచమే ఒక నాటకరంగం, ప్రజలందరూ అందులో పాత్రధారులే. --విలియం షేక్స్పియర్