ఈ రోజు వ్యాఖ్యలు అక్టోబరు 2012
స్వరూపం
అక్టోబరు 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- అక్టోబరు 1, 2012:ఉంటే ఉండు లేకుంటే వెళ్ళు -- విలియం షేక్స్‌పియర్
- అక్టోబరు 2, 2012:కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు -- శ్రీశ్రీ
- అక్టోబరు 3, 2012:చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా. -- వేమన
- అక్టోబరు 5, 2012:దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు -- భగత్ సింగ్
- అక్టోబరు 6, 2012:నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు -- ఆరుద్ర
- అక్టోబరు 8, 2012:పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం -- డెంగ్ జియాఓపింగ్
- అక్టోబరు 9, 2012:ప్రజలను ప్రేమించలేనివాడు దేశభక్తుడు కాలేడు -- టంగుటూరి ప్రకాశం
- అక్టోబరు 10, 2012:సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- అక్టోబరు 11, 2012:ఆల్కహాల్ నా నుంచి తీసుకున్నదాని కంటే నేను దాన్నుంచి పొందిందే ఎక్కువ -- చర్చిల్
- అక్టోబరు 12, 2012:ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో! --మార్క్ ట్వెయిన్
- అక్టోబరు 13, 2012:కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
- అక్టోబరు 14, 2012:కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు -- విలియం షేక్స్‌పియర్
- అక్టోబరు 15, 2012:తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.-- గురజాడ అప్పారావు
- అక్టోబరు 16, 2012:పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది -- లియోనార్డో డావిన్సీ
- అక్టోబరు 17, 2012:ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న -- మదర్ థెరీసా
- అక్టోబరు 18, 2012:భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు. --ఆర్థర్ లూయీస్
- అక్టోబరు 19, 2012:మన వాళ్ళుత్త వెధవాయిలోయ్ -- కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర.
- అక్టోబరు 20, 2012:మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు -- అరిస్టాటిల్
- అక్టోబరు 21, 2012:మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. --ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- అక్టోబరు 22, 2012:వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- అక్టోబరు 23, 2012:సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము.--గౌతమ బుద్ధుడు
- అక్టోబరు 24, 2012:హీనంగా చూడకు దేనీ, కవితామయమోయ్ అన్నీ -- శ్రీశ్రీ
- అక్టోబరు 25, 2012:ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. --బిల్ వాన్
- అక్టోబరు 26, 2012:సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. -- స్వామీ వివేకానంద
- అక్టోబరు 27, 2012:శోధించి సాధించాలి అదియే ధీరగుణం -- శ్రీశ్రీ
- అక్టోబరు 28, 2012:మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం -- గురజాడ అప్పారావు
- అక్టోబరు 29, 2012:పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది -- మహాత్మాగాంధీ
- అక్టోబరు 30, 2012:తెలుగువారికి తమిళ సినిమా ఎంత అర్థమౌతుందో నాస్తికుడికి అధ్యాతికత అంతే అర్థమౌతుంది -- సత్యసాయిబాబా
- అక్టోబరు 31, 2012:విప్లవం అనేది డిన్నర్ పార్టీలాంటిది కాదు -- మావో