ఈ రోజు వ్యాఖ్యలు జనవరి 2010

వికీవ్యాఖ్య నుండి

జనవరి 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • జనవరి 1, 2010:అప్పులేనివాడె యధిక సంపన్నుడు. --వేమన
  • జనవరి 2, 2010:పది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. -- స్వామీ వివేకానంద
  • జనవరి 4, 2010:భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు. -- ఆర్థర్ లూయీస్
  • జనవరి 7, 2010:హీనంగా చూడకు దేనీ, కవితామయమోయ్ అన్నీ. --శ్రీశ్రీ
  • జనవరి 8, 2010:ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు. -- అబ్రహం లింకన్
  • జనవరి 9, 2010:ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో! -- మార్క్ ట్వెయిన్
  • జనవరి 11, 2010:స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం. -- ముస్సోలినీ
  • జనవరి 12, 2010:సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • జనవరి 14, 2010:మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. -- జో బ్రాండ్.
  • జనవరి 15, 2010:విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు -- రూసో
  • జనవరి 17, 2010:సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము.- -గౌతమ బుద్ధుడు
  • జనవరి 21, 2010:నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. -- ముస్సోలినీ
  • జనవరి 24, 2010:పురుషులందు పుణ్య పురుషులు వేరయ. -- వేమన
  • జనవరి 25, 2010:ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయీ లెవ్వరు?-- శ్రీశ్రీ
  • జనవరి 27, 2010:మైదానంలో వీక్షించేందుకు సచిన్ టెండుల్కర్ బ్యాట్ కంటె అద్భుతమైన వస్తువు మరొకటి ఉండదు -- హర్ష భోగ్లే.
  • జనవరి 28, 2010:ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారౌతాడు. -- మహాత్మా గాంధీ
  • జనవరి 30, 2010:కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
  • జనవరి 31, 2010:సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. -- స్వామీ వివేకానంద

ఇవి కూడా చూడండి[మార్చు]