ఈ రోజు వ్యాఖ్యలు డిసెంబరు 2009
Appearance
డిసెంబరు 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- డిసెంబరు 1, 2009: ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. --బిల్ వాన్
- డిసెంబరు 2, 2009: ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్. -- గురజాడ అప్పారావు
- డిసెంబరు 3, 2009: ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. -- శ్రీశ్రీ
- డిసెంబరు 4, 2009: గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...-- నన్నయ
- డిసెంబరు 5, 2009: చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- డిసెంబరు 6, 2009: తెలివి కల వారంతా తెలుగువారేనోయ్ -- జి.వి.కృష్ణారావు
- డిసెంబరు 7, 2009: నాకు మనుషులందరూ సమానమే, అందరినీ సమానంగా ధ్వేషిస్తాను. -- జీన్ పాల్ సార్ట్రే
- డిసెంబరు 8, 2009: నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు. -- ఆరుద్ర
- డిసెంబరు 9, 2009: మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం. -- స్వామీ వివేకానంద
- డిసెంబరు 10, 2009: మూర్ఖుడైన మిత్రుడు వివేకవంతుడైన శతృవుకంటె ప్రమాదం. -- విలియం షేక్స్‌పియర్
- డిసెంబరు 11, 2009: పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు. -- వేమన
- డిసెంబరు 12, 2009: కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. -- మహాత్మా గాంధీ
- డిసెంబరు 13, 2009: కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు. -- శ్రీశ్రీ
- డిసెంబరు 14, 2009: జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
- డిసెంబరు 15, 2009: దిగిరాను దిగిరాను దివినుంచి భువికి... -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- డిసెంబరు 16, 2009: పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం. -- డెంగ్ జియాఓపింగ్
- డిసెంబరు 17, 2009: పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది. -- లియోనార్డో డావిన్సీ
- డిసెంబరు 18, 2009: వ్యాధిని వైద్యుడు తగ్గిస్తాడు, ప్రకృతి మామూలుగానే నయం చేస్తుంది. -- అరిస్టాటిల్
- డిసెంబరు 19, 2009: నిలబడడానికి ఆధారం చూపించండి, భూమినే పైకెత్తుతా -- ఆర్కిమెడిస్
- డిసెంబరు 20, 2009: ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. --అనీబీసెంట్
- డిసెంబరు 21, 2009: చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. --మార్క్ ట్వెయిన్
- డిసెంబరు 22, 2009: దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. -- భగత్ సింగ్
- డిసెంబరు 23, 2009: మాతృభూమికి సేవ చెయ్యని యవ్వనం వృధా -- చంద్రశేఖర్ ఆజాద్
- డిసెంబరు 24, 2009: అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. -- సి.నారాయణరెడ్డి
- డిసెంబరు 25, 2009: కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు. -- విలియం షేక్స్‌పియర్
- డిసెంబరు 26, 2009: తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు. --వేమన
- డిసెంబరు 27, 2009: నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు? -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- డిసెంబరు 28, 2009: నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని. --మార్క్ ట్వెయిన్
- డిసెంబరు 29, 2009: పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి. -- శ్రీశ్రీ
- డిసెంబరు 30, 2009: పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది. -- రవీంద్రనాథ్ ఠాగూర్
- డిసెంబరు 31, 2009: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. -- మదర్ థెరీసా