ఈ రోజు వ్యాఖ్యలు ఫిబ్రవరి 2012

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

ఫిబ్రవరి 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

 • ఫిబ్రవరి 1, 2012:==>ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో! --మార్క్ ట్వెయిన్
 • ఫిబ్రవరి 2, 2012:==>కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది -- మహాత్మా గాంధీ
 • ఫిబ్రవరి 4, 2012:==>మనవాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందంటే... సైకిల్ స్టాండులో ఒక్ సైకిల్ నెట్టేస్టే మిగితావన్నీ పడిపోయేట్టు.-- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
 • ఫిబ్రవరి 5, 2012:==>మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. -- అరిస్టాటిల్
 • ఫిబ్రవరి 7, 2012:==>స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు -- రూసో
 • ఫిబ్రవరి 8, 2012:==>కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి.-- బసవరాజు అప్పారావు.
 • ఫిబ్రవరి 9, 2012:==>కాయలు కాచిన చెట్టు కొమ్మలు వంగి వేలాడుతుంటాయి. గొప్పవాడివి కావాలనుకుంటే వినయంగా, నిరాడంబరంగా ఉండాలి-- రామకృష్ణ పరమహంస
 • ఫిబ్రవరి 10, 2012:==>వ్యక్తికి బహువచనం శక్తి--శ్రీశ్రీ
 • ఫిబ్రవరి 11, 2012:==>పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను. -- భగత్ సింగ్
 • ఫిబ్రవరి 12, 2012:==>తెలుగువారికి తమిళ సినిమా ఎంత అర్థమౌతుందో నాస్తికుడికి అధ్యాతికత అంతే అర్థమౌతుంది -- సత్యసాయిబాబా
 • ఫిబ్రవరి 13, 2012:==>అనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన
 • ఫిబ్రవరి 14, 2012:==>ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం --శ్రీశ్రీ
 • ఫిబ్రవరి 17, 2012:==>విప్లవం అనేది డిన్నర్ పార్టీలాంటిది కాదు -- మావో
 • ఫిబ్రవరి 19, 2012:==>ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలను ఉతికి పారేయడమే ప్రజాస్వామ్యం-- ఆస్కార్ వైల్డ్.
 • ఫిబ్రవరి 20, 2012:==>పెళ్ళి చేసుకోవడం సులభం, కాపురం చేయడమే కష్టం-- రాబర్ట్ ఫ్లాక్.
 • ఫిబ్రవరి 21, 2012:==>ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది. --ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
 • ఫిబ్రవరి 22, 2012:==>ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి -- అరిస్టాటిల్
 • ఫిబ్రవరి 23, 2012:==>కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు. -- సి.నారాయణరెడ్డి
 • ఫిబ్రవరి 24, 2012:==>కోపమున ఘనత కొంచెమైపోవును -- వేమన
 • ఫిబ్రవరి 26, 2012:==>ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. --అనీబీసెంట్
 • ఫిబ్రవరి 27, 2012:==>కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు -- విలియం షేక్స్‌పియర్
 • ఫిబ్రవరి 28, 2012:==>నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా -- లాలు ప్రసాద్ యాదవ్

ఇవి కూడా చూడండి[మార్చు]