ఈ రోజు వ్యాఖ్యలు మే 2011

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

మే 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

 • మే 2, 2011: ---> అధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గంలోనే సాధ్యమౌతుంది -- సత్యసాయిబాబా
 • మే 3, 2011: ---> ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు. -- జాన్ మేజర్
 • మే 4, 2011: ---> జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
 • మే 5, 2011: ---> తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి. -- కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర..
 • మే 6, 2011: ---> నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా. -- లాలు ప్రసాద్ యాదవ్
 • మే 7, 2011: ---> పురుషులందు పుణ్య పురుషులు వేరయ. -- వేమన
 • మే 13, 2011: ---> కోపమున ఘనత కొంచెమైపోవును -- వేమన
 • మే 17, 2011: ---> నాకు మనుషులందరూ సమానమే, అందరినీ సమానంగా ధ్వేషిస్తాను. -- జీన్ పాల్ సార్ట్రే

\

 • మే 18, 2011: ---> నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు -- ఆరుద్ర
 • మే 19, 2011: ---> పది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను -- స్వామీ వివేకానంద
 • మే 21, 2011: ---> ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయీ లెవ్వరు?-- శ్రీశ్రీ
 • మే 23, 2011: ---> మన వాళ్ళుత్త వెధవాయిలోయ్. -- కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర.
 • మే 24, 2011: ---> మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. -- అరిస్టాటిల్
 • మే 28, 2011: ---> మనవాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందంటే... సైకిల్ స్టాండులో ఒక్ సైకిల్ నెట్టేస్టే మిగితావన్నీ పడిపోయేట్టు.-- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
 • మే 29, 2011: ---> ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. -- బిల్ వాన్
 • మే 30, 2011: ---> ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు. -- అబ్రహం లింకన్
 • మే 31, 2011: ---> సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. -- స్వామీ వివేకానంద
ఇవి కూడా చూడండి[మార్చు]