Jump to content

సామెతలు - అ

వికీవ్యాఖ్య నుండి
సామెతలు
అం అః
క్ష

"అ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

  • అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
  • అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు
  • అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
  • అంగడీ అమ్మి గొంగళి కొన్నట్లు.
  • అంగిట బెల్లం కడుపులో విషం.
  • అంచు డాబే కాని, పంచె డాబు లేదు
  • అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె.
  • అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు
  • అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
  • అంతంత కోడికి అర్థశేరు మసాలా.
  • అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు
  • అంతా మనమంచికే.
  • అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.
  • అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు
  • అందని ద్రాక్ష పుల్లన
  • అందని మామిడిపండ్లకు అర్రులు చాచినట్లు
  • అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
  • అందరికీ నేను లోకువ, నాకు నంబిసింగరాయ లోకువ.
  • అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు
  • అందరూ అందలం ఎక్కితే మోసేవాళ్ళెవరు?
  • అందరూ శ్రీవైష్ణవులే- బుట్టెడు రొయ్యలు మాయ మయాయి.
  • అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
  • అందితే తల, అందకపోతే కాళ్లు
  • అంధుడికి అద్దం చూపించినట్లు
  • అంబలి తాగేవాడికి మీసాలొత్తేవాడొకడు
  • అక్క మనదైతే బావ మనవాడా?
  • అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ.
  • అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
  • అగ్నికి వాయువు తోడైనట్లు
  • అచ్చి పెళ్ళి బుచ్చి చావుకు వచ్చిందట.
  • అచ్చొచ్చిన భూమి అడుగే చాలు.
  • అడకత్తెరలో పోకచెక్క
  • అడగందే అమ్మ అయినా పెట్టదు
  • అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
  • అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
  • అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
  • అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
  • అడుసు త్రొక్కనేల, కాలు కడుగనేల.
  • అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
  • అతడికంటె ఘనుడు అచంట మల్లన్న
  • అతి వినయం ధూర్త లక్షణం
  • అత్త చేసే పనులకు ఆరళ్ళే లేవట.
  • అత్త సొమ్ము అల్లుడు దానం
  • అత్తచచ్చిన ఆరు మాసాలకు కోడలు ఏడ్చిందట
  • అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
  • అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
  • అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు
  • అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
  • అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
  • అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
  • అధముడికి ఆలి అయ్యే దాని కంటే బలవంతుడికి బానిస కావడం మేలు.
  • అనగా అనగా రాగం తినగా తినగా రోగం
  • అనుమానం పెనుభూతం
  • అనువుగాని చోట అధికులమనరాదు.
  • అన్నం చొరవే కాని అక్షరం చొరవ లేదు
  • అన్నం పెట్టిన వాడింటికి కన్నం వేసినట్లు
  • అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
  • అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
  • అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
  • అన్నిదానాలలోకి నిదానమే గొప్పదన్నాట్ట!!
  • అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
  • అప్పిచ్చువాడు బాగు కోరతాడు, తీసుకున్నవాడు చెడు కోరతాడు.
  • అప్పిచ్చువాడు వైద్యుడు
  • అప్పు నిప్పులాంటిది...
  • అప్పుచేసి పప్పు కూడు
  • అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
  • అబద్దం ఆడినా గోడ కట్టినట్లుండాలి
  • అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
  • అభ్యాసము కూసు విద్య
  • అమ్మ గృహ ప్రవేశం, అయ్య అగ్ని ప్రవేశం.
  • అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
  • అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిన నివ్వదు
  • అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
  • అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి.
  • అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
  • అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
  • అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
  • అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో పెట్టినట్లు
  • అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు
  • అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
  • అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...
  • అరటిపండు ఒలిచి చేతిలోపెట్టినట్లు.
  • అరిచే కుక్క కరవదు
  • అర్దరాత్రి మద్దెల దరువు
  • అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...
  • అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
  • అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్థరాత్రిపూట గొడుగుపట్టమన్నాడట.
  • అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
  • అల్లుడికి వండిన అన్నం కొడుక్కి పెట్టిందట.
  • అవివేకితో స్నేహం కన్నా వివేకితో విరోధం మిన్న.
  • అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకే సరిపోలేదట.
  • అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
  • అసలే కోతి, ఆపై కల్లు తాగినట్టు
  • అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
  • ఆకలి ఆకలి అత్తగారు అంటే రోకలి మింగమన్నదట
  • ఆకాశానికి నిచ్చెన వెయ్యడం
  • ఆకాశం మీదికి ఉమ్మేస్తే అది మన ముఖం మీదె పడుతుంది
  • ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పుణ్యం
  • అంతా ఆ తాను ముక్కే
  • అన్నీ ఒక్కటే అని అర్థం.
  • ఆ మొద్దు లోదే ఈ పేడు
  • ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
  • ఆకలి ఆకాశమంత... గొంతు సూది బెజ్జమంత
  • ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
  • ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
  • ఆకారపుష్టి నైవేద్యనష్టి
  • ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
  • ఆవు పాతిక బందె ముప్పాతిక
  • ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో
  • ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
  • ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం
  • ఆశ సిగ్గెరుగదు.... ఆకలి రుచి ఎరుగదు
  • ఆవులిస్తే ప్రేవులు లెక్కపెట్టే రకం
  • ఆశగలమ్మ దోషమెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
  • ఆస్తి మూరెడు... ఆశ బారెడు
  • అందరు అందలం ఎక్కితే .... మోసేవాడెవరు?
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_అ&oldid=16978" నుండి వెలికితీశారు