సామెతలు - ఏ
స్వరూపం
సామెతలు |
---|
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ ఘ |
చ ఛ జ ఝ |
ట ఠ డ ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
"ఏ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
- ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
- ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
- ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
- ఏడ్చే మగాడిని నవ్వే మహిళను నమ్మరాదు
- ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
- ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
- ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
- ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
- ఏమండీ కరణంగారూ...? గోతిలో పడ్డారే అంటే, కాదు కసరత్తు చేస్తున్నాను అన్నాడట
- ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని
- ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
- ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య