సామెతలు - క
స్వరూపం
సామెతలు - క
[మార్చు]ఈ పేజీలో "క" అక్షరంతో ప్రారంభమయ్యే సామెతలు ఇవ్వబడ్డాయి. సామెతలు అనేవి ప్రజల అనుభవాల నుండి ఏర్పడిన సూక్తులు, జ్ఞానవాక్యాలు. ఇవి తరతరాలుగా చెవితో చెవికి సంక్రమించినవే కాదు, సామాజిక జీవితాన్ని సూచించే నైతిక పాఠాలుగా కూడా పరిగణించబడతాయి. ప్రతి సామెత వెనుక ఒక విశేషమైన అర్థం, సందర్భం ఉంటాయి. గ్రామీణ జీవితంలో ఇవి మార్గదర్శక వాక్యాలుగా ఉపయోగించబడతాయి.
సామెతలు
[మార్చు]- కడుపులో కత్తెర, నోటిలో చక్కెర.
- కవితకు మెప్పు, కాంతకు కొప్పు ఉండాలి.
- కనిపించేదానికీ కనిపించనిదానికీ నడుమ వంతెనయే కళ.
- కవులూ రచయితలూ బతికినంతకాలం చచ్చినట్లు పడుండి చచ్చిన తర్వాత బతకడమారంభిస్తారు.
- కవులు ప్రపంచం యొక్క గుర్తించబడని శాసన కర్తలు.
- కలిసివచ్చే రోజువస్తే నడిచివచ్చే కొడుకు పుడతాడు.
- కాకి పిల్ల కాకికి ముద్దు.
- కాలే కడుపుకు మండే గంజి.
- కాళీ కి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాళీకి.
- కాచి కాచి కోతలు వచ్చేసరికి కునుకు తీసినట్లు.
- కాలిన లోహం కలిసిపోయినట్లు కష్ట సమయంలో మనుష్యుల మనస్సులు ఒక్కటవుతాయి.
- కాలం చెఱసాలలో ప్రతివాడూ బందీ అయిన అస్వతంత్రుడు.
- కల్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదన్నట్లు.
- కాని కాలంవస్తే పైబట్ట పామై కరుస్తుంది.
- కూడు పెట్టక పోతేమానె కుక్కను కట్టెయ్యమన్నట్లు.
- కుట్టేవాళ్ళకు కుడి చేతికింద. ఏడ్చేవాళ్ళకు ఎడం చేతికింద కూచోకూడదు.
- కోపమునకు ఘనత కొంచమైపోవును.
- కొంప నిండా కోళ్లు వున్నా కోయటానికి,కుయటానికి ఒకటి పనికి రానట్టు
- కొండంత దూదికి కొండంత నిప్పెందుకు.
- కోతల కాలంలో ఎలుకకు ఏడుగురు భార్యలున్నా ఫరవాలేదు.
- కొంపలంటుకుంటే బావి త్రవ్వినట్లు.
- కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగుణ.
- కీడెంచి మేలు ఎంచమన్నారు.
- కొండ నాలికకి మందు వేస్తే, ఉన్న నాలిక ఊడినట్లు.
- కొండముచ్చు పెళ్లికి కోతి పేరంటాలు
- కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి.
- కూర్చుని కూర వందలెను గాని ఒంగుని తీర్థం పోస్తాను అందట
- కూర్చొని గుర్రాలు మలపడం.
- కూటి కోసం కోటి విద్యలు.
- కొరివితో తల గోక్కున్నట్లు.
- కొక్కి రాయి కొక్కి రాయి ఎందుకు ఉన్నావ్ అంటే చక్కనోల్లని వెక్కిరించడానికి అని
- కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు.
- కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డదట.
- కోర్కెలను మనం తినుటలేదు; కోర్కెలు మనలను తినివేస్తున్నాయి.
- కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
- కాఱ్ఱలేని వాణ్ణి గొఱ్ఱె అయినా కరుస్తుంది.
- కాలానికి ఒక రూపం లేదు, దానికి పాపంలేదు-కాలం అద్దంలాంటిది-అంధయుగమైనా స్వర్ణయుగమైనా అది మన ప్రతిబింబం.
- కల్లు తాగిన కోతి
- కొంటె తీరనిది కొసరితే తీరుద్దంట
- కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం
- కథకి కాళ్ళు లేవు ముంతకి చెవులు లేవు
- కథ కంచికి మనం ఇంటికి
- కడుపు చించు కుంటే కాళ్ల ముందు పడినట్టు
- కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు
- కొత్త డాక్టర్ కాంటే పాఠ రోగీ మేలు అని
- కోరి కోరి అందగాణ్ణి చేసుకుంటే కోతి వాటం తో పిల్లలు పుట్టారంట
- కడుపులో లేనిది కవుగలించుకుంటే వస్తుందా?
- కోరా ఎంత ఉన్నా కూరావుద్దా? ఊళ్ళో ఎంత మంది ఉన్నా మనవాళ్ళు అవుతారా?
- కోక ఇచ్చిన అమ్మ పీట పట్టుకుని తిరిగినట్టు
- కొంగు తడిస్తే చలి కానీ కొకంత తడిస్తే ఎం చాలి
- కాచిన చెట్టుకు రాళ్ల దెబ్బలు
- కరుణ ఉన్నవాడు దేవుడితో సమానం
- కక్కర లేని వాడికి కలత ఎందుకు
- కరిగే బంగారం ఎప్పుడూ మెరుస్తుంది
- కంచె దాటే కొడుకే గెలిచినట్టు
- కప్పకు ఏనుగు కలలు
సామెతల ప్రాముఖ్యత
[మార్చు]సామెతలు భాషా సంపదలో ఓ విలక్షణంగా నిలిచినవే. ఇవి చిన్నవే అయినా, గొప్ప బోధను అందిస్తాయి. అనేక సామెతలు పాఠశాలల పాఠ్యపుస్తకాల్లోనూ, సాహిత్య రచనలలోనూ ప్రస్తావించబడతాయి. అనుభవాల మీద ఆధారపడి అభివృద్ధి చెందిన ఈ వాక్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.