సామెతలు - ఎ
స్వరూపం
సామెతలు |
---|
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ ఘ |
చ ఛ జ ఝ |
ట ఠ డ ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
"ఎ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
- ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
- ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
- ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది
- ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
- ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు
- ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి?
- ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
- ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?
- ఎద్దు పుండు కాకికి ముద్దు
- ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు
- ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
- ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
- ఎవడి నెత్తి మీద వాడే చెయ్యి పెట్టుకున్నట్లు