సామెతలు - త
స్వరూపం
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"త" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట.
- తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.
- తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట.
- తన కంపు తన కింపు.
- తన కోపమే తన శత్రువు.
- తనది కాకపోతే కాశీదాకా దేకచ్చు.
- తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము.
- తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు.
- తమలపాకుతో నీవొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.
- తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.
- తల ప్రాణం తోకకి వచ్చినట్లు.
- తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
- తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు.
- తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది.
- తల్లి దైవము, తండ్రి ధనము.
- తల్లి లేని పిల్లలు అల్లులేని తీగలు.
- తల్లి అల్లం పిల్ల బెల్లం
- తా వలచినది రంభ, తా మునిగింది గంగ.
- తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి.
- తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది.
- తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు.
- తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు.
- తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట.
- తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు.
- తడిసిగాని గుడిసె కప్పడు.
- తాతకు దగ్గులు నేర్పినట్టు.
- తాదూర సందు లేదు, మెడకో డోలు.
- తాను దూర సందు లేదు తలకో కిరీటమట.
- తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు.
- తానా అంటే తందానా అన్నట్లు.
- తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట.
- తామరాకు మీద నీటిబొట్టులా.
- తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు.
- తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి.
- తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు.
- తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట.
- తిట్టను పోరా గాడిదా అన్నట్టు.
- తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు.
- తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట.
- తినగా తినగా గారెలు చేదు.
- తినగ తినగ వేము తియ్యగనుండు.
- తిన్నాళ్లకెళ్తే పిల్లల్ని , పుట్టింటికెళ్తే మొగుడిని తీసుకెళ్లకూడదంట
- తినబోతూ రుచులు అడిగినట్లు.
- తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి.
- తిన్నింటి వాసాలు లెక్కేయటం.
- తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు.
- తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
- తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది.
- తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.
- తుంగభద్ర స్నానానికి కొండుభొట్లు అనుజ్ఞ ఎందుకు.
- తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి.
- తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
- తెగేదాక లాగవద్దు.
- తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య.
- తేలు కుట్టిన దొంగలా.
- తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట.
- తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు.
- తోక తెగిన కోతిలా.
- తోక ముడుచుట.
- తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు.
- తోటివాడు తొడకోసుకుంటే తాను మెడ కోసుకున్నట్లు.
- తోట ఉన్నోడికి తీట ఉన్నోడికి తీరిక ఉండదంట
- తొడ బలం ఉంటే తొంభై మంది తొక్కొచ్చు
- తింగరోడికి ఉంగరం పెడితే బొంగరం చేసి ఆడుకున్నాడంట
- తెలివి తక్కువ ఆకలి ఎక్కువ
- తాబేలు నడక తేలిక కాదు
- తలకిందులైన చప్పుడు వినిపించదు
- తొందరలో తడబడతాడు
- తల వంచిన వాడికే తలప్రహారం
- తలతిరిగిన దానికి తడబాటు
తగుదునమ తందాన